
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆరు కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ‘కుబేర’ లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమా నుంచి రొమాంటిక్ డ్రామాల వరకు.. వినోదం పండుగ!
Key Points
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆరు కొత్త సినిమాలు, సిరీస్‌లు!
బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా 'కుబేర' ఓటీటీ ప్రీమియర్!
‘ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ’ రొమాంటిక్ డ్రామా సిరీస్ చివరి సీజన్!
పిల్లల కోసం ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్’, ‘ఎం3గ్యాన్ 2.0’ సిరీస్‌లు!
కుబేర ఓటీటీ ప్రీమియర్
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు దూసుకొస్తున్నాయి. ఇందులో సూపర్ హిట్ సినిమాలు, అదరగొట్టే సిరీస్ లు ఉన్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్ లు కలిపి ప్రైమ్ వీడియోలో ఆరు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వివిధ భాషల్లోని ఆ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఓ సారి చూసేద్దాం.
బాక్సాఫీస్ ను షేక్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర . లక్ష కోట్ల క్రైమ్ థ్రిల్లర్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ తో అదరగొట్టారు. మాజీ సీబీఐ ఆఫీసర్ గా నాగార్జున గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చాలా ఈజ్ తో చేసేశారు. ఈ మూవీలో రష్మిక మందన్న కూడా కీ రోల్ ప్లే చేసింది. థియేటర్లలో సత్తాచాటిన ఈ థ్రిల్లర్ మూవీ జూలై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కుబేర ఓటీటీలో అడుగుపెడుతుంది.
రొమాంటిక్ డ్రామా సిరీస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోని అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది సమ్మర్ ఐ టర్న్ డ్ ప్రెట్టీ’కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, యూత్ రొమాన్స్, సెక్స్, మ్యారేజీ తదితర అంశాలతో కూడిన ఈ వెబ్ సిరీస్ నుంచి చివరి సీజన్ వచ్చేస్తోంది. ఈ ఇంగ్లిష్ రొమాంటిక్ డ్రామా సిరీస్ జూలై 16 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. టీనేజీ నుంచి యూత్ గా మారిన అబ్బాయిలు, అమ్మాయిల కథను ఇందులో చూడొచ్చు. ఘాటైన ముద్దు సన్నివేశాలు కూడా ఉంటాయి.
ప్రైమ్ వీడియో లో పిల్లలను అట్రాక్ట్ చేసే కామిక్ సిరీస్ లు కూడా ఈ వారం వచ్చేస్తున్నాయి. పాపురల్ యానిమేషన్ సిరీస్ లు ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్’, ‘ఎం3గ్యాన్ 2.0’ కామిక్ సిరీస్ లు రెంట్ విధానంలో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ సిరీస్ లను కిడ్స్ ఇష్టపడే అవకాశముంది. ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్’, ‘ఎం3గ్యాన్ 2.0’ సిరీస్ లు ఈ రోజు (జూలై 15) నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
పిల్లల కోసం వినోదం
ఇక బ్రైడ్ హార్డ్, ఫైనల్లీ డాన్ లాంటి ఇంగ్లీష్ సినిమాలు కూడా ప్రైమ్ వీడియో బాట పట్టనున్నాయి. ఈ రెండు మూవీస్ రెంట్ విధానంలో అందుబాటులో ఉండబోతున్నాయి. జూలై 18న ఈ రెండు ఫిల్మ్స్ ఓటీటీ రిలీజ్ అవుతాయి.
చివరగా, ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విభిన్న జోనర్ల సినిమాలు, సిరీస్‌లతో అద్భుతమైన వినోదం లభిస్తుంది. మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి!


