|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ వ్యాఖ్యలపై SKN సంచలనం: ‘ఆ బట్టల సత్తి మాటలు వినొద్దు’ – సినీ వర్గాల్లో చర్చ!

Published: 27-12-2025, 7:33 AM
శివాజీ వ్యాఖ్యలపై SKN సంచలనం: 'ఆ బట్టల సత్తి మాటలు వినొద్దు' – సినీ వర్గాల్లో చర్చ!
  • శివాజీ దండోరా ఈవెంట్లో అమ్మాయిల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
  • అనసూయ, చిన్మయి వంటి పలువురు నటీనటులు ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలను ఖండించారు.
  • నిర్మాత SKN శివాజీని ఉద్దేశించి ‘ఏ బట్టల సత్తి గాడి మాటలు వినక్కర్లేదు’ అంటూ ఘాటుగా స్పందించారు.
  • ఆత్మవిశ్వాసం గుండెలోంచి వస్తుంది తప్ప బట్టల్లోంచి కాదని SKN అభిప్రాయపడ్డారు.

శివాజీ దండోరా ఈవెంట్లో అమ్మాయిల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలువురు నటీనటులు శివాజీని తప్పుబడుతుండగా, తాజాగా నిర్మాత SKN ఘాటుగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం

Producer SKN : ఇటీవల శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు, హీరోయిన్స్ చక్కగా చీరలు కట్టుకోండి, మంచి బట్టలు వేసుకోండి అని చెప్తూ పొరపాటున ఓ రెండు అసభ్యకరమైన పదాలు మాట్లాడటంతో కొంతమంది శివాజీపై విమర్శలు చేస్తున్నారు. అమ్మాయిలకు మీరెవరు చెప్పడానికి, అమ్మాయిలపై మీ కంట్రోల్ ఏంటి అంటూ పలువురు శివాజీపై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం శివాజీ పదాలు తప్పుగా వాడినా మంచి విషయమే చెప్పాడు అని సపోర్ట్ చేస్తున్నారు.(Producer SKN)

ఇప్పటికే ఇండస్ట్రీలోనే అనసూయ, చిన్మయి, ఝాన్సీ, నాగబాబు, ప్రకాష్ రాజు, బివిఎస్ రవి.. ఇలా పలువురు నటీనటులు శివాజీని తప్పు పడుతూ కామెంట్స్ చేసారు. తాజాగా నిర్మాత SKN కూడా శివాజీపై కామెంట్స్ చేసారు. నేడు పతంగ్ సినిమా సక్సెస్ మీట్ కి హాజరయిన SKN సినిమా గురించి మాట్లాడిన అనంతరం శివాజీపై కామెంట్స్ చేసారు.

SKN ఘాటు స్పందన: ‘ఆ బట్టల సత్తి గాడు’

ఇండస్ట్రీలో మిశ్రమ స్పందనలు

నిర్మాత SKN మాట్లాడుతూ.. అమ్మాయిలు, హీరోయిన్స్ మీకు ఏ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటే ఆ డ్రెస్ వేసుకోండి. ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్ గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టల సత్తి గాడి మాటలు వినక్కర్లేదు. కాన్ఫిడెన్స్ అనేది గుండెలోంచి వస్తుంది. వేసే బట్టల్లోంచి కాదు. ఏం జరిగినా మన మనసు నుంచే ఉంటుంది. మనసు బాగుంటే అన్ని మంచిగానే అనిపిస్తాయి అని అన్నారు. దీంతో శివాజీని ఇలా బట్టల సత్తిగాడు అని వ్యాఖ్యానిస్తూ కామెంట్స్ చేయడంతో SKN మాటలు కూడా వైరల్ గా మారాయి.

శివాజీ వ్యాఖ్యలపై SKN స్పందనతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. సెలబ్రిటీల మధ్య ఈ మాటల యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాల మధ్య జరుగుతున్న ఈ చర్చ కొనసాగనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.