|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘స్కై’ మూవీ లవర్స్ కి పండగే! ‘నిను కసిరిన సమయాన’ లిరికల్ సాంగ్ రిలీజ్.. విన్నారా?

Published: 03-01-2026, 7:00 AM
'స్కై' మూవీ లవర్స్ కి పండగే! 'నిను కసిరిన సమయాన' లిరికల్ సాంగ్ రిలీజ్.. విన్నారా?
  • ‘స్కై’ చిత్రంలో మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించారు.
  • ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి కొత్త లిరికల్ సాంగ్ విడుదలైంది.
  • కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ సంగీతం అందించగా, దర్శకుడు పృథ్వీ పెరిచెర్ల సాహిత్యం రాశారు.
  • గతంలో విడుదలైన ‘తపనే తెలుపగ’, ‘పోయేకాలం నీకు’ వంటి పాటలు మిలియన్ వ్యూస్ సాధించాయి.

వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వంలో వస్తున్న ‘స్కై’ సినిమా నుంచి ‘నిను కసిరిన సమయాన’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమాలోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ సంగీతం అందించగా, పృథ్వీ పెరిచెర్ల సాహిత్యం రాశారు.

‘స్కై’ చిత్రం విశేషాలు

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు పృథ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న మూవీ నుంచి తాజాగా ‘నిను కసిరిన సమయాన’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ సంగీతం అందించగా.. డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల లిరిక్స్ అందించాడు. వైష్ణవి ఆకట్టుకునేలా పాడింది. ‘నిను కసిరిన సమయాన.. నను మరచిన నా హృదయం.. అడుగడుగున నిను వెతికి.. అణువణువున నిను తలచి.. ఆలోచనంతా నీ వెనకే.. ఆరాధనంతా నీ కొరకే..’ అంటూ లవ్ ఫీల్‌తో సాగింది. ‘స్కై’ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’, ‘పోయేకాలం నీకు..’, ‘నిన్ను చూసిన..’ సాంగ్స్ చాట్ బస్టర్స్‌గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ కాగా ఈ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

‘నిను కసిరిన సమయాన’ పాట ప్రత్యేకతలు

గత పాటల విజయం, రిలీజ్ డేట్

‘స్కై’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘నిను కసిరిన సమయాన’ పాట కూడా సంగీత ప్రియుల ఆదరణ పొందుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ లవ్ ఫీల్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.