|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్

Published: 06-12-2025, 4:08 AM
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
  • మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘సైయారా’ 45 కోట్ల బడ్జెట్‌తో 570.33 కోట్లు వసూలు చేసింది.
  • ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’, ‘డ్రాగన్’ సినిమాలు భారీ విజయాలతో స్టార్‌డమ్ తెచ్చాయి.
  • కేవలం 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 87.23 కోట్లు వసూలు చేసి టాలీవుడ్‌ను ఆకర్షించింది.
  • గుజరాతీ సినిమా ‘సు ఫ్రమ్ సో’ 50 లక్షల బడ్జెట్‌తో 109.5 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది.

2025లో చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టించాయి. అంచనాలకు మించి వసూళ్లను సాధించి, స్టార్ హీరోల చిత్రాల పోటీలో నిలిచాయి. పలు హిందీ, సౌత్ చిత్రాలు తక్కువ పెట్టుబడితో అద్భుతమైన లాభాలను ఆర్జించి సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి.

మోహిత్ సూరి, ప్రదీప్ రంగనాథన్ చిత్రాల ఘన విజయం

మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ భట్టా నటించిన హిందీ సినిమా సైయారా. ఈ సినిమా ఈ ఏడాది జూలై 18న రిలీజ్ అయింది. 45 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 570.33 కోట్లు వసూలు చేసింది.

హోంబలే ఫిలింస్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యానిమేషన్ భక్తి  సినిమా ఇది. 40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 326.82 కోట్లు వసూలు చేసింది.

ప్రదీప్ రంగనాథన్ నటించిన రెండు చిన్న సినిమాలు ఈ ఏడాది భారీ విజయాలు సాధించడంతో పాటు అతనికి మంచి పేరు కూతీ తీసుకువచ్చాయి. కీర్తి  దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన సినిమా డ్యూడ్. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 114.3 కోట్లు వసూలు చేసింది.

ఇక అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా డ్రాగన్. 36 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 151.83 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు చిన్న సినిమాల భారీ విజయాలతో ప్రదీప్ కు సౌత్ లో హీరోగా స్టార్ డమ్ వచ్చింది.

తక్కువ బడ్జెట్ – భారీ వసూళ్లు: ఒక విశ్లేషణ

డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో కళ్యాణి ప్రియదర్శిని, నస్లెన్ నటించిన సినిమా లోకా. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈసినిమా 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి..  ప్రపంచవ్యాప్తంగా 326.82 కోట్లు వసూలు చేసింది.

పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ నటించిన సినిమా తలైవన్ తలైవి. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ హీరోగా నటించిన హారర్ సినిమా  డైస్ ఇరే. 24 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 82.12 కోట్లు వసూలు చేసింది.

సౌత్, బాలీవుడ్ చిన్న సినిమాల ప్రభంజనం

అభిషన్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రాన్ నటించిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా, ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 87.23 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలను కూడా ఆకర్శించింది  ఈమూవీ.

జె.పి. తుమినాడ్ దర్శకత్వంలో షానీల్ గౌతమ్ నటించిన కన్నడ సినిమా సు ఫ్రమ్ సో. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 122.83 కోట్లు వసూలు చేసింది.

అంకిత్ సఖియా దర్శకత్వంలో రీవా రచ్ నటించిన గుజరాతీ సినిమా ఇది. కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈమూవీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 109.5 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. గుజరాతీలో ఫస్ట్ 100 కోట్ల సినిమా ఇదే.

మొత్తంగా, 2025లో చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెను సంచలనం సృష్టించాయి. కథాబలం, కొత్తదనం ఉంటే బడ్జెట్ ముఖ్యం కాదని మరోసారి నిరూపించాయి. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని వినూత్న చిత్రాలకు స్ఫూర్తినిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.