
📌 Key Points
- భారత మార్కెట్లో 80కి పైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలు పెరిగాయి.
- రెండవ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ ధరలు 15% వరకు పెరిగే అవకాశం ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ సగటు ధర $400 డాలర్లకు చేరింది.
- ఏఐ చిప్స్ కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్నాయి.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఇది చేదు వార్త. భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు మళ్ళీ పెరగబోతున్నాయి. ఇప్పటికే 80 మోడళ్ల ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలకు కారణాలు
Smartphones Prices : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్ల ధరలు మళ్లీ పెరగబోతున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే భారత మార్కెట్లో 80కి పైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్ల పెరిగాయి.
వచ్చే త్రైమాసికంలో కూడా స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Smartphones Prices) ఫోన్ ధరలు మరో 15 శాతం పెరగొచ్చు. అసలు స్మార్ట్‌ఫోన్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల ధరల పెంపు : స్మార్ట్‌ఫోన్ ధరల పెంపు భారత మార్కెట్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి . 2025 చివరి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ సగటు ధర మొదటిసారిగా 400 డాలర్లకు దాటింది.
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ధరల పరిస్థితి
భారత కరెన్సీలో ఈ ధర సుమారుగా రూ. 37వేలు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఫోన్ సగటు ధర ఇప్పుడు రూ. 37వేలు ఉంటుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు గతంలో కన్నా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
మిడ్ రేంజ్ ఫోన్లకు భారీ డిమాండ్ : బడ్జెట్ ఫోన్‌ల డిమాండ్ తగ్గుతుండగా మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఊపందుకుంటోంది. ఇదే కాలంలో రూ. 15వేల నుంచి రూ. 30వేల మధ్య ధర ఉన్న ఫోన్ల మార్కెట్ వాటా 35శాతం నుంచి 45శాతానికి పెరిగింది. ఈ మార్పు కేవలం డిమాండ్ వల్ల మాత్రమే కాదు.. ఫోన్ల ధరలు పెరగడం వల్ల గతంలో బడ్జెట్ కేటగిరీలో ఉన్న చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి మారిపోయాయి. ఫలితంగా తక్కువ ధరలలో లభించే ఫోన్లు కొనేందుకు ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Read Also : Citroen basalt X SUV : కొత్త కారు కొంటున్నారా? భారీగా పెరిగిన సిట్రోయెన్ SUV కార్ల ధరలు.. ఏకంగా రూ. 40వేలు పెంపు.. ఫుల్ డిటెయిల్స్..!
మిడ్-రేంజ్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
స్మార్ట్‌ఫోన్ల ధరల పెరుగుదలకు కారణాలివే : ఏఐ (AI) కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలకు దారితీసింది. వాస్తవానికి, మెమరీ చిప్ తయారీదారులు ఇకపై వినియోగదారుల మార్కెట్ కోసం చిప్‌లను ఉత్పత్తి నిలిపివేశారు. ఇప్పుడు డేటా సెంటర్లను నిర్మించేందుకు భారీ సైజులో మెమరీ చిప్‌లు అవసరమయ్యే ఏఐ కంపెనీలకు తయారుచేసి అందిస్తున్నారు.
అంతేకాదు.. చిప్ తయారీదారులు పూర్తిగా ఏఐ డేటా సెంటర్లపై దృష్టి సారించారు. దాంతో స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజ్‌లకు అవసరమయ్యే మెమరీ చిప్‌ల కొరత ఏర్పడింది. ఈ సరఫరా కొరత కారణంగా మెమరీ చిప్‌ల ధరలు పెరిగాయి. ఫలితంగా కంపెనీలకు ఖర్చులు పెరిగి వినియోగదారులపై భారం పడుతోంది.
మెమరీ చిప్‌ల కొరత ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు వంటి ఇతర డివైజ్‌లపై కూడా ప్రభావం పడింది. లెనోవా, డెల్, హెచ్‌పీ వంటి పలు కంపెనీలు ఇప్పటికే తమ ల్యాప్‌టాప్‌ల ధరలను భారీగా పెంచాయి. ఈ మెమరీ సంక్షోభం మరికొంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదల అనేది వినియోగదారులపై ప్రభావం చూపే అంశం. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, కొనుగోలుదారులు తమ అవసరాలకు తగిన ఫోన్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.


