
📌 Key Points
- శోభన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు, ప్రతి విషయంలో పక్కాగా ఉండేవారు.
- `ఖైదీ బాబాయ్` సెట్లో షావుకారు జానకి వండిన భోజనం వద్దన్న శోభన్ బాబు.
- మధ్యాహ్నం షూటింగ్ సమయంలో కేవలం క్యారెట్, బీట్‌రూట్, ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకున్న శోభన్ బాబు.
- శోభన్ బాబు తీసుకునే ఆహారం చూసి షాక్ అయిన యూనిట్ సభ్యులు.
టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఒక స్టార్ హీరోయిన్ కి సెట్ లోనే నో చెప్పేశారట. అసలు ఏం జరిగింది? ఎందుకు నో చెప్పాల్సి వచ్చింది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
ఫుడ్ విషయంలో శోభన్ బాబు రూల్స్!
శోభన్ బాబు గురించి చెప్పాల్సి వస్తే, ఆయన అందం గురించిన ప్రస్తావనే మొదటగా వస్తుంది. సోగ్గాడిగా ఆయన పాపులర్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన్ని మించిన అందగాడు లేడని అంతా చెబుతుంటారు. అది కూడా నిజమే అని చెప్పొచ్చు. అయితే ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఎక్కువగా ఫ్యామిలీ కథలతో సినిమాలు చేసి మెప్పించారు. భార్యాభర్తల మధ్య రిలేషన్, వారి మధ్య గొడవలకు ప్రయారిటీ ఉన్న కథలతోనే సినిమాలు చేసి మహిళా అభిమానులను సొంతం చేసుకున్నారు.
శోభన్ బాబు వ్యక్తిగతంగా చాలా సిస్టమాటిక్ ఉన్న నటుడు. ప్రతి విషయంలో ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. ఆయన ఫుడ్ విషయంలో, వ్యవహారం విషయంలో, షూటింగ్ విషయంలో, రిలేషన్ విషయంలోనూ అదే క్రమశిక్షణ మెయింటేన్ చేసేవారు. అదే సమయంలో మహిళలు, హీరోయిన్లతో రిలేషన్ విషయంలోనూ ఆయన క్రమశిక్షణతో ఉండేవారని అంటుంటారు. అయితే మాజీ సీఎం, నటి జయలలితతో మాత్రం ఆయనకు సంబంధం ఉందనే వార్తలున్నాయి. ఆమెతో ఎఫైర్ నడిపించాడని అంటుంటారు. ఇద్దరూ పెళ్లి వరకు వెళ్లినట్టు టాక్.
షూటింగ్ సెట్ లో ఏం జరిగిందంటే..?
ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కి మాత్రం శోభన్ బాబు సెట్‌లోనే నో చెప్పాడట. తాను ఏ విషయంలోనూ టెంప్ట్ కాననే విషయాన్ని ఆయన స్పష్టం చేశారట. జానకికి ఆయన నో చెప్పారట. ఓ సారి `ఖైదీ బాబాయ్` అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో శోభన్ బాబు హీరో. టికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణి శ్రీ హీరోయిన్. షావుకారు జానకి కీలక పాత్రలో నటించింది. ఆమె బాధితురాలిగా నటించింది. ఈ చిత్రం 1974లో విడుదలై, పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు జానకి తన ఇంటి నుంచి చాలా వెరైటీస్ ఫుడ్ వండుకొని వచ్చింది.
సెట్‌లో చాలా మందికి తన ఇంటి ఫుడ్‌ని వడ్డించింది జానకి. ఈ క్రమంలో శోభన్ బాబుని కూడా తన వంటని టేస్ట్ చేయాలని కోరిందట. కానీ ఆయన మాత్రం అస్సలు తగ్గలేదు. సెట్‌లోనే అందరి ముందు నో చెప్పారట. అప్పటికే ఫుడ్ విషయంలో సోగ్గాడు చాలా నియమాలను ఫాలో అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో, షూటింగ్ సమయంలో అస్సలు హార్డ్ ఫుడ్ తీసుకోవడం లేదు. దీంతో జానకి వెంటనే నో చెప్పాడట. తాను తన ఇంటిఫుడ్ మాత్రమే తింటానని చెప్పారట.
అందరి ముందు నో చెప్పిన సోగ్గాడు!
మరి ఇంతకి ఆ రోజు సోగ్గాడు ఏం తిన్నాడటంటే.. క్యారెక్ ముక్కలు, బీట్‌రూట్, ఫ్రూట్ మిక్స్, విటమిన్స్ ఉన్న ఫ్రూట్ జూస్‌ని తీసుకున్నాడట. ఆ పూటకి సోగ్గాడి భోజనం అదే. అది చూసి అంతా షాక్ అయ్యారు. ఘుమఘుమలాడే నాన్ వెజ్ వంటకాలను కాదని, ఫ్రూట్స్ తింటూ ఉండిపోయాడట. అలా ఫుడ్‌ని కంట్రోల్‌గా తిన్నారు కాబట్టే ఆయన మంచి ఫిజిక్‌ని మెయింటేన్ చేయగలిగారు, సోగ్గాడిగా పాపులర్ అయ్యారని చెప్పొచ్చు. ఫుడ్ విషయంలో హీరోయిన్ ఆఫర్ చేసిన కూడా సోగ్గాడు నో చెప్పడం ఆశ్చర్యానికి గురయ్యే విషయమనే చెప్పొచ్చు.
శోభన్ బాబు జీవితంలోని ఈ సంఘటన ఆయన ఎంతటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అనేదానికి నిదర్శనం. మరిన్ని ఆసక్తికరమైన టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


