|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sobhita Dhulipala: సమంతకు పోటీగా గుడ్ న్యూస్ చెప్పిన నాగ చైతన్య, శోభిత జంట.. శుభాకాంక్షలు

Published: 04-12-2025, 6:50 AM
Sobhita Dhulipala: సమంతకు పోటీగా గుడ్ న్యూస్ చెప్పిన నాగ చైతన్య, శోభిత జంట.. శుభాకాంక్షలు
  • సమంత రెండో పెళ్లి వార్తలు గత మూడు రోజులుగా వైరల్.
  • నాగ చైతన్య భార్య శోభితా దూళిపాళ్ల పెట్టిన పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది.
  • శోభితా, నాగ చైతన్యల మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఈ పోస్ట్.
  • శోభిత ఎమోషనల్ పోస్ట్‌కు చైతూ ప్రేమపూర్వక స్పందన.

సమంత రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, నాగ చైతన్య భార్య శోభితా దూళిపాళ్ల తన మొదటి పెళ్లి రోజు సందర్భంగా పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. శోభిత పోస్ట్‌కు చైతూ కూడా స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సమంత రెండో పెళ్లి వార్తలు

నటి సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి ఇటీవల కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జరిగింది. యోగ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి. సమంత ఈ ఫోటోలను పంచుకుంది. దీంతో గత మూడు నాలుగు రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా నాగచైతన్య రెండో భార్య, నటి శోభితా దూళిపాళ్ల పెట్టిన పోస్ట్ హాట్‌ టాపిక్‌ అవుతుంది.

‘భూత శుద్ధి వివాహం’ పద్ధతిలో సమంత పెళ్లి జరిగింది. ఈ వార్తలు వైరల్ అవుతున్న టైంలో, నాగ చైతన్య భార్య శోభిత పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు శోభితా పోస్ట్ కి నాగచైతన్య కూడా స్పందించారు. తన హ్యాపీనెస్‌ ని పంచుకున్నారు.

నాగ చైతన్య – శోభితా మొదటి పెళ్లి రోజు

సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమించిన నాగ చైతన్య, గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. తమ మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. పెళ్లై ఏడాది పూర్తయిన సందర్భంగా ఇద్దరు ఆనందం వ్యక్తం చేశారు.

పెళ్లి వీడియోను పోస్ట్ చేస్తూ, ‘గాలి ఎప్పుడూ ఇంటికి వీస్తుంది. నేను భర్త అని పిలిచే వ్యక్తితో ఏడాది ఒక ట్రిప్పీ ట్రిప్‌  కొత్తగా ఫీల్ అవుతున్నా. అగ్ని ద్వారా శుద్ధి చేయబడినట్టుగా నా మిస్టర్‌తో ఏడాది’ అని శోభిత ఎమోషనల్‌గా రాశారు. దీనికి నాగచైతన్య స్పందించారు. నీ జర్నీలో నేను భాగం కావడం ఆనందంగా ఉంది నా లవ్‌` అని పేర్కొన్నారు చైతూ. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

శోభిత ఎమోషనల్ పోస్ట్, చైతూ స్పందన

శోభితా ధూళిపాళ (@sobhitad) షేర్ చేసిన పోస్ట్

సమంత పెళ్లి వార్తలు ఓ వైపు చర్చనీయాంశంగా మారగా, నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల తమ మొదటి పెళ్లి రోజును ఆనందంగా జరుపుకుంటూ తమ ప్రేమను చాటుకున్నారు. ఈ జంటకు సినీ వర్గాల నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.