|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి సింహాద్రి ‘సన్ ఆఫ్’ ట్రైలర్: ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల! ఉత్కంఠ రేపే టీజర్!

Published: 11-02-2026, 4:35 AM
సాయి సింహాద్రి 'సన్ ఆఫ్' ట్రైలర్: ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల! ఉత్కంఠ రేపే టీజర్!
  • సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా ‘సన్ ఆఫ్’ మూవీ ఫిబ్రవరి 27న విడుదల కానుంది.
  • ట్రైలర్ విడుదల వేడుకలో కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
  • సతీష్ బత్తుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి కంటెంట్‌తో వస్తోందని కోన వెంకట్ అన్నారు.
  • హీరోయిన్ మీరా రాజ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘సన్ ఆఫ్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. బత్తుల సతీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విడుదల వేడుక గ్రాండ్ గా జరిగింది.

‘సన్ ఆఫ్’ మూవీ ట్రైలర్ విడుదల

Son Of Movie Trailer : సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో.. ప్ర‌ముక రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది.

Read also- Ravi Teja: డిజాస్టర్‌ల తర్వాత కిక్ కాంబో రిపీట్… వర్కౌట్ అవుతుందా?

ఈవెంట్‌కు హాజరైన ప్రముఖులు

హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాను. భాస్కర భట్ల గారితోనే ఈ కథ కోసం ఎక్కువగా చర్చించాం. అప్పుడే నాకు మ్యూజిక్ డైరెక్టర్ రిషిని పరిచయం చేశాడు. రిషి ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. కిట్టు మాకు గొప్ప విజువల్స్‌ను ఇచ్చాడు. శోభా గారు అమ్మోరులా నా చేతిని పట్టుకుని మా సినిమాని ఇంత దూరం తీసుకు వచ్చారు. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు.

Read also- Pradeep Ranganathan: నిర్మాతగా మారనున్న ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్గా తొలి అవకాశం ఆమెకే?

చిత్ర యూనిట్ మాటలు

హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. ఇది నాకు తొలి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సతీష్ గారికి థాంక్స్. ఇది నాకు సుదీర్ఘమైన ప్రయాణం. మా హీరో సాయి గారి ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. రిషి మ్యూజిక్, కిట్టు విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. భాస్కర భట్ల మాట్లాడుతూ .. ‘సాయి నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం. నచ్చిన టెక్నిషియన్లను తీసుకుని సాయి ఈ మూవీని గొప్పగా నిర్మించాడు. ఇందులో రెండు మంచి పాటల్ని రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి, సతీష్ గారికి థాంక్స్. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌ రిషిని నేను పరిచయం చేసినట్టు అయింది. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సన్ ఆఫ్ మూవీ ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.