
మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సోనాలి బింద్రే, తాజా ఇంటర్వ్యూలో తన క్యాన్సర్ చికిత్స అనుభవాలను పంచుకుంది. ఆమెకు సల్మాన్ ఖాన్ ఎలా అండగా నిలిచాడో ఆమె వివరించింది.
Key Points
సోనాలి బింద్రే క్యాన్సర్‌తో పోరాడిన తన అనుభవాలను పంచుకుంది.
చికిత్స సమయంలో సల్మాన్ ఖాన్ ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచాడు.
సల్మాన్ ఖాన్ ఆమె భర్తతో మాట్లాడి వైద్యుల గురించి ఆరా తీశాడు.
‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్‌లో సల్మాన్‌తో సోనాలికి విభేదాలున్నాయని వెల్లడించింది.
క్యాన్సర్‌తో సోనాలి పోరాటం
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. ఆ సినిమాతో ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆ తర్వాత కూడా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తాను క్యాన్సర్ చికిత్స తీసుకున్న అనుభవాలను పంచుకుంది. ఆ సమయంలో తనకు ఓ స్టార్ హీరో పూర్తి మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో తెలుసుకుందామా?
సల్మాన్ ఖాన్ మద్దతు
2018లో సోనాలి బింద్రేకు క్యాన్సర్ రావడంతో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ సమయంలో తన చికిత్స గురించి పదే పదే ఆరా తీశారని తెలిపింది. నేను చికిత్స పొందుతున్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు న్యూయార్క్ వచ్చాడని సోనాలి వెల్లడించింది. తనకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకోవాలి.. అంతేకాదు వారితో కూడా మాట్లాడాలని సల్మాన్ అడిగారని తెలిపింది.
‘హమ్ సాత్ సాత్ హై’ వివాదం
అయితే ఇటీవల ‘హమ్ సాత్ సాత్ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ తీరుపై సోనాలి విమర్శలు చేసింది. తనను కొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపింది. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమా షూటింగ్‌లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లమని వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే సోనాలి బింద్రే ‘ది బ్రోకెన్ న్యూస్’ రెండో సీజన్‌లో కనిపించింది.
సోనాలి బింద్రే తన క్యాన్సర్‌తో జరిగిన పోరాటం మరియు సల్మాన్ ఖాన్ మద్దతు గురించి వివరించింది. ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్‌లో వారి మధ్య విభేదాలు కూడా ఉన్నాయని తెలిపింది.


