
యూట్యూబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి సోనియా సింగ్ తాజాగా మరో ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారు. రెండు నెలల్లో రెండో కారు కొనడం ఆశ్చర్యం కలిగించింది.
Key Points
సోనియా సింగ్ రెండు నెలల్లో రెండో ఖరీదైన బెంజ్ కారు కొన్నారు.
కారు ధర 1.39 కోట్ల నుండి 1.50 కోట్ల మధ్య ఉంటుంది.
ఆమె యూట్యూబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్నారు.
సోనియా సింగ్ కొత్త కారు
Soniya Singh : యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్ ఇప్పుడు సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సిద్దు పవన్ అనే మరో నటుడితో ప్రేమలో ఉంది సోనియా. వీరిద్దరూ లివింగ్ టు గెదర్ లో ఉన్నారని టాక్.
సోనియా సింగ్ తాజాగా ఓ కొత్త కార్ ని కొనుక్కుంది. హైదరాబాద్ లో ఓ టెంపుల్ దగ్గర తన కొత్త కార్ కి పూజలు చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ కార్ బెంజ్ ఫోర్ మ్యాటిక్ అని తెలుస్తుంది. దీని ధర దాదాపు 1.39 కోట్ల నుంచి 1.50 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. అంటే ఆల్మోస్ట్ కోటిన్నర పెట్టి సోనియా కార్ కొందా అని ఆశ్చర్యపోతున్నారు.
కారు ధర ఎంత?
ఓ రెండు నెలల క్రితం సోనియా బెంజ్ కంపెనీకి చెందిన కార్ కొనుక్కొని అప్పుడు కూడా ఇలాగే పూజ చేయించిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు మరోసారి కొత్త కార్ ఫొటోలు షేర్ చేసి.. దేవుడి ప్లాన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటుంది. ప్రయాణం కష్టంగా ఉన్నా దేవుడ్ని మర్చిపోవద్దు. మన కోసం ఏదైనా గొప్పగా చేస్తున్నాడు అని ఎదురుచూడాలి అంటూ పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో స్పందన
దీంతో ఇంత కాస్ట్లీ కార్ సోనియా ఎలా కొనుక్కుంది? సోనియా అంత సంపాదిస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు.
సోనియా సింగ్ యొక్క విజయం మరియు ఆమె కొత్త కారు కొనుగోలు ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె కెరీర్ మరియు భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.


