|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sonu Sood: ఒక అపార్ట్‌మెంట్‌ అమ్మేసి రెండు ప్రాపర్టీస్‌ కొన్న సోనూసూద్‌..

Published: 16-10-2025, 5:15 AM

విలక్షణ నటుడు సోనూసూద్‌ ఆస్తుల వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. ముంబైలో కొత్త ప్లాట్‌ను కొనుగోలు చేసి, కుమారుడికి అపార్ట్‌మెంట్‌ కొనిచ్చారు. పాత అపార్ట్‌మెంట్‌ అమ్మకం ద్వారా లాభం పొందారు. ఆయన సినీ అప్‌డేట్స్‌ కూడా ఈ కథనంలో చూడండి.

Key Points

1

సోనూసూద్ ముంబై పన్వేల్‌లో రూ.1.09 కోట్లతో 777 గజాల ప్లాట్‌ను కొనుగోలు చేశారు.

2

కుమారుడు ఇషాన్‌ ముంబై అంధేరిలో రూ.2.6 కోట్లకు అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు.

3

మహాలక్ష్మిలోని తన పాత అపార్ట్‌మెంట్‌ను రూ.8.10 కోట్లకు అమ్మకంతో లాభం పొందారు.

4

సోనూసూద్ 'ఫతే' చిత్రం నిలదొక్కుకోలేకపోయింది, కానీ 'మదజగరాజ' హిట్‌గా నిలిచింది.

సోనూసూద్ ఆస్తుల వివరాలు

విలక్షణ నటుడు సోనూసూద్‌ ( Sonu Sood ) ప్లాట్‌ కొనుగోలు చేశాడు. కుమారుడు ఇషాన్‌తో కలిసి ముంబై పన్వేల్‌లోని 777 చదరపు గజాల భూమిని తన సొంతం చేసుకున్నాడు. దీనికోసం రూ.1.09 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.30 వేలు, స్టాంప్‌డ్యూటీ కింద రూ. 6.3 లక్షలు చెల్లించాడు. ముంబై-పుణె మార్గంలో పన్వేల్‌ ప్రాంతం ఉంది. పన్వేల్‌లో ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు రాబోతున్నాయి.

ఇటీవలే అపార్ట్‌మెంట్‌ కొనుగోలు ముంబై రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ( Navi Mumbai International Airport ) కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. కాగా సోనూసూద్‌ కుమారుడు ఇషాన్‌.. ఇటీవల ఆగస్టులో సైతం ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ కొన్నాడు. దీనికోసం రూ. 2.6 కోట్లు ఖర్చు చేశాడు. అదే నెలలో సోనూసూద్‌.. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో తన అపార్ట్‌మెంట్‌ను రూ.8.10 కోట్లకు అమ్మేశాడు. దీన్ని 2012లో రూ.5 కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 13 ఏళ్ల తర్వాత 8 కోట్లకు అమ్మేశాడు.

కుమారుడి కొనుగోలు, పాత అపార్ట్‌మెంట్ అమ్మకం

సినిమా సినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్‌ చివరగా ఫతే సినిమాలో నటించాడు. స్వీయదర్శకత్వంతో పాటు సోనూసూద్‌ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇతడు పుష్కరకాలం క్రితం నటించిన తమిళ మూవీ మదజగరాజ మాత్రం జనవరిలో రిలీజై సూపర్‌ హిట్‌ అందుకుంది.

తాజా చిత్రాలు, బాక్సాఫీస్ రిపోర్ట్

సోనూసూద్ కేవలం నటుడిగానే కాకుండా, తన ఆస్తుల నిర్వహణలో కూడా తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో కొనసాగుతున్న ప్రగతి స్పష్టంగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.