|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

re-release: ఆ సినిమా రీరిలీజ్.. రిలీజ్ టైమ్‌లోనే చూడలేదు ఇప్పుడెవరు చూస్తారంటున్న నెటిజన్లు

Published: 16-06-2025, 12:12 PM
re-release: ఆ సినిమా రీరిలీజ్.. రిలీజ్ టైమ్‌లోనే చూడలేదు ఇప్పుడెవరు చూస్తారంటున్న నెటిజన్లు

2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా త్వరలో రీరిలీజ్ కానుంది. అర్జున్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రీరిలీజ్‌పై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ సమయంలో చూడని వారు ఇప్పుడు చూస్తారా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

Key Points

1

2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది.

2

జూన్ 28న ఈ చిత్రం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

4

రిలీజ్ టైంలో చూడని వారు ఇప్పుడు చూస్తారా అనే చర్చ నెట్టింట జరుగుతోంది.

హనుమాన్ జంక్షన్ రీరిలీజ్ డేట్

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నటుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్స్ బర్త్‌డేలు, పండుగల సందర్భంగా గతంలో విడుదలైన చిత్రాలను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో చిత్రం రీరిలీజ్‌కు సిద్ధం అయింది. అర్జున్, జగపతి బాబు, తొట్టెంపూడి వేణు, లయ, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హనుమాన్ జంక్షన్’. ఎం.రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలైంది.

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య.. ప్రేమ కారణంగా ఏర్పడిన మనస్పర్థలు చివరికి ఏ పరిస్థికి దారితీస్తాయి.. ఫైనల్‌గా మళ్లీ ఎలా కలుస్తారు అనేది స్టోరీ. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన కామెడీ పరంగా పర్వాలేదు అనిపించుకుంది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. జూన్ 28న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర బృందం.. ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. రిలీజ్ టైమ్‌లోనే చూడలేదు.. రీరిలీజ్ అవసరమా అని కొందరు అంటుంటే.. ఇలాంటి చిత్రాలు రీరిలీజ్‌లో మంచి హిట్ అవుతాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్ల స్పందనలు

సినిమా కథాంశం

చివరగా, ‘హనుమాన్ జంక్షన్’ రీరిలీజ్‌పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఈ రీరిలీజ్ ఎంతవరకు విజయవంతం అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.