|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సైకిల్ పై ఇండియా యాత్ర.. యువకుడికి సర్ ఫ్రైజ్ ఇచ్చిన హీరో సోను సూద్

Published: 21-06-2025, 5:02 AM
సైకిల్ పై ఇండియా యాత్ర.. యువకుడికి సర్ ఫ్రైజ్ ఇచ్చిన హీరో సోను సూద్

మహబూబాబాద్‌కు చెందిన నితిన్ అనే యువకుడు సైకిల్‌పై ఆల్ ఇండియా ట్రిప్‌ చేస్తున్నాడు. తన సైకిల్‌పై సోను సూద్ ఫోటోను పెట్టుకుని ప్రయాణిస్తున్న నితిన్‌కు సోను సూద్ షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Key Points

1

సోను సూద్ సైకిల్‌పై ఇండియా యాత్ర చేస్తున్న యువకుడిని కలిశారు.

2

యువకుడు తన సైకిల్‌పై సోను సూద్ ఫోటోను పెట్టుకున్నాడు.

4

ఈ ఘట్టం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సైకిల్ యాత్ర

ఇటీవల కాలంలో ఎంతోమంది యువకులు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు (A bicycle trip) చేసుకుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు సైకిల్‌పై ఆల్ ఇండియా ట్రిప్(All India trip on a bicycle) చేస్తున్నాడు. అయితే తన పర్యటనలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో, సమాజ సేవకుడిగా పేరుగాంచిని రియల్ హీరో‌గా పేరు తెచ్చుకున్న సోను సూద్ ఫోటోను పెట్టుకొని.. ముందుకు సాగుతున్నాడు. ఈ క్రంలో నితీన్‌కు హీరో సోనూ సూద్ (Hero Sonu Sood) అదిరిపోయే సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. తన ఫోటోతో సైకిల్ యాత్ర చేస్తున్న అభిమాని గురించి తెలుసుకున్న ఆయన వెంటనే యువకుడి వద్దకు వెళ్లి మందలించాడు.

వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ ఇండియా ట్రిప్ చేస్తున్న యువకుడిని సోను సూద్ ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. సైకిల్ పై తన ఫోటోను పెట్టుకొని భారత యాత్ర చేయడం సంతోషంగా ఉందని.. నితిన్ లాంటి వారి నేటి సమాజంలోని యువతకు ప్రేరణ గా నిలుస్తారని, ఇలాంటి యువకులకు మనం సపోర్ట్ గా నిలవాలని, నితీన్ అనుకున్నది సాధించాలని కొరుకుంటున్నానని ఈ సందర్భంగా సోను సూద్ మద్దతుగా నిలిచాడు. కాగా తన అభిమానిని హీరో కలిసి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చిన అభినిని సైతం హీరో కలిసి మాట్లాడటం తో మరోసారి ఆయన రియల్ హీరో అనిపించుకున్నాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

సోను సూద్ ఆశ్చర్యం

సోషల్ మీడియా వైరల్

సోను సూద్ యువతకు ఆదర్శంగా నిలిచి, నితిన్‌కు మద్దతునిచ్చారు. ఈ ఘటన సామాజిక బాధ్యతను చాటి చెప్పింది. సోను సూద్ నిజమైన హీరో అని మరోసారి నిరూపించుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.