|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ఎలా ఉందంటే?

Published: 07-06-2025, 11:18 PM
ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ఎలా ఉందంటే?

‘సొప్పన సుందరి’ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్ర పోషించింది. లక్కీ డ్రాలో కారు గెలుచుకోవడంతో మొదలయ్యే ఈ కథ, కుటుంబ కథానాయకత్వంతో కామెడీ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథాంశం: లక్కీ డ్రా మరియు కుటుంబం

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టిన బ్యూటీ ‘ఐశ్వర్య రాజేశ్'(Aishwarya Rajesh). ఇప్పుడు తెలుగువారికి సుపరిచితమైన పేరు. గతంలో ఆమె పలు తమిళ చిత్రాల్లో మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో వచ్చిన డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సొప్పన సుందరి (Soppana Sundari). 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

‘సొప్పన సుందరి’ కథేంటంటే.. అహల్య (ఐశ్వర్య రాజేశ్‌) తన తల్లి, అక్కతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటుంది. తాను ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే అహల్యకు ఉహించని విధంగా రూ.10 లక్షల విలువైన లక్కీ డ్రాలో బహుమతిగా లభిస్తుంది. అయితే కారు దక్కిందని సంతోషించేలోపే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కారు అహల్య కుటుంబానికి దక్కిందా? నగలే కొనకుండా అసలు ఈ బహుమతి వీరికెలా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సొప్పన సుందరి చూడాల్సిందే.

నటన మరియు కామెడీ

ఎలా ఉందంటే.. వీకెండ్‌ వచ్చిందంటే చాలు. సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. ‍అలాంటి వారిని కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీ చిత్రం సొప్పన సుందరి. అలాగే మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీకి మంచి సందేశం కూడా  ఇచ్చే మూవీ. అహల్య(ఐశ్వర్య రాజేశ్), అన్నయ్య దొర (కరుణాకరన్‌) పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో అహల్య తన అక్క పెళ్లి బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రథమార్థంలో అహల్య కారు గెలుచుకోవడం, ఆ తర్వాత అహల్య అక్కకు కూడా పెళ్లి కుదురుతుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కారు కోసం అన్నయ దొర ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాయి. అలా ఈ కథ చివరికీ పోలీస్‌ స్టేషన్‌కు చేరడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.

పోలీసుల చేతికి కారు వెళ్లడంతో..  సెకండాఫ్‌ వచ్చేసరికి కథ మొత్తం కారు చుట్టే తిరుగుతుంది. ఆ కారును దక్కించుకునే క్రమంలో ఐశ్వర్య రాజేశ్.. ఆమె అన్నయ్య దొర తన టీమ్‌తో కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్‌ కామెడీని తలపిస్తాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ లాజిక్‌లెస్‌గా ఉంటాయి. అయితే కామెడీ కథ కోణంలో చూస్తే అలా ఉంటేనే సెట్‌ అవుతుంది. అందుకే డైరెక్టర్‌ ఎలాంటి లాజిక్‌ లేకుండా కథను రాసుకున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్‌ కలగదు. చివర్లో కారును అడ్డం పెట్టుకుని ఎస్సై చేసే దుర్భుద్దిని చూపిస్తూ డైరక్టర్ ఆ కోణంలోనూ ఆడియన్స్‌కు మేసేజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీతో మనది కానీ వస్తువును బలవంతంగా తీసుకెళ్తే మనిషికి మనశ్శాంతి ఉండదనే సందేమిచ్చారు.  కక్లైమాక్స్‌లో దురాశ దుంఖానికి చేటు అనే సామెతతో కథను ముగించాడు. కామెడీతో పాటు మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీకి మంచి సందేశాన్నిచ్చే చిత్రం సొప్పన సుందరి. వీకెండ్‌లో మంచి కామెడీతో పాటు సందేశాత్మక చిత్రం చూడాలనుకుంటే సొప్పన సుందరి ట్రై చేయొచ్చు.

సినిమా ప్రతిబింబం

ఎవరెలా చేశారంటే.. ఐశ్వర్య రాజేశ్ ఈ కథకు ప్రధాన బలం. తన పాత్రలో సహజంగా నటించి అభిమానులను మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా ‌తన పాత్రలో ఒదిగిపోయింది. ఐశ్వర్యకు తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్‌, ఆమె అన్నయ్యగా దొరగా కరుణాకరన్‌ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో సాగదీత సన్నివేశాలు కట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఫర్వాలేదనిపించాయి.

మొత్తంమీద, ‘సొప్పన సుందరి’ ఒక హాయిగా చూడదగ్గ కామెడీ ఎంటర్‌టైనర్. ఐశ్వర్య రాజేశ్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని లాజిక్‌లెస్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇది బాగుంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.