
📌 Key Points
- పవన్ కళ్యాణ్: రేణు దేశాయ్‌తో విడాకుల తర్వాత అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్న పవర్ స్టార్!
- ప్రకాష్ రాజ్: లలిత కుమారితో విడాకుల తరువాత పోనీ వర్మను పెళ్లాడిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.
- ప్రభుదేవ: నయనతారతో బ్రేకప్ తర్వాత డాక్టర్ హిమానీ సింగ్‌ను వివాహం చేసుకున్న ప్రభుదేవ సంతోషంగా ఉన్నారు.
- రాధిక: రెండు విడాకుల తర్వాత శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న రాధిక, సౌత్ లో మోస్ట్ పవర్ఫుల్ కపుల్!
టాలీవుడ్ సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో ఆసక్తికర విషయాలు జరుగుతుంటాయి. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మరికొందరు విడాకులు తీసుకుని మరోసారి ప్రేమలో పడుతున్నారు. అలాంటి వారి గురించిన సమాచారం ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ ప్రేమ కథ
టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య రెండు సార్లు ప్రేమలో పడ్డాడు. ముందుగా హీరోయిన్ సమంతతో 7 ఏళ్లు ప్రేమలో ఉన్న చైతూ.. పెళ్లి చేసుకున్న మూడేళ్లకే విడాకులు తీసుకున్నాడు. ఆతరువాత మరో హీరోయిన్ శోభితతో రెండో సారి ప్రేమలో పడ్డాడు. వీరు పెళ్లి చేసుకుని హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
మరో వైపు సమంత కూడా రెండో సారి ప్రేమలో పడింది. నాగచైతన్యతో విడాకుల తరువాత దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమించి రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు స్టార్స్ తమ జీవితంలో రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.
సౌత్ స్టార్ హీరో, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ రెండుసార్లు విడాకులు తీసుకున్న తర్వాత, రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవాను పెళ్లి చేసుకున్నారు. పవన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్ళాడాడు. ఆమెతో విడాకుల తరువాత అన్నాలెజ్నెవాను ప్రేమించి పెళ్లాడాడు.
ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి
నటుడు ప్రకాష్ రాజ్ ముందుగా లలిత కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విడాకులు తరువాత.. 2010లో పోనీ వర్మను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కొడుకు ఉన్నాడు. మొదటి పెళ్లి ద్వారా ప్రకాష్ రాజ్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ప్రభుదేవ డాక్టర్ హిమానీ సింగ్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ప్రభుదేవ గతంలో నయనతారను కూడా ప్రేమించారు. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం చాలా పెద్దవివాదం అవ్వడంతో వెనక్కి తగ్గారు.
రాధిక, శరత్‌కుమార్ సక్సెస్ ఫుల్ మ్యారేజ్
రాధిక రెండుసార్లు విడాకులు తీసుకున్న తర్వాత, 2001లో నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు ఈ జంట దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన, అన్యోన్యమైన దంపతులుగా ఉన్నారు. శరత్‌కుమార్‌కు కూడా ఇది రెండో పెళ్లే.
ప్రముఖ నటి లక్ష్మి మూడు పెళ్లిల్లు చేసుకున్నారు. మొదట రెండు విడాకుల తర్వాత నటుడు శివచంద్రన్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నారు లక్ష్మి. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదే స్టార్ డమ్ ను కంటీన్యూ చేశారు.
ఈ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.


