
📌 Key Points
- దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని స్టేషన్లపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది.
- పలాస-ఇచ్ఛాపురం సెక్షన్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉందని ప్రకటనలో తెలిపారు.
- ఈ స్టేషన్ల వల్ల తూర్పు కోస్తా రైల్వే ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని రైల్వే శాఖ పేర్కొంది.
- రైల్వే ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షిస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చింది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని స్టేషన్ల విషయంలో తలెత్తిన అభ్యంతరాలపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. పలాస-ఇచ్ఛాపురం సెక్షన్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై రైల్వే శాఖ ప్రకటన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దులు, స్టేషన్ల విషయంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తూర్పు కోస్తా రైల్వే జోన్ లో పలు స్టేషన్లు కలపడం, విడదీయడం వంటి నిర్ణయాలతో ఆదాయంపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్సీఓఆర్) జోన్ ప్రధాన కార్యాలయం ఉంటుందని భారతీయ రైల్వే ఆదివారం ప్రకటించింది. సుమారు 50 కిలోమీటర్ల పొడవైన పలాస-ఇచ్చాపురం సెక్షన్ లో ఏడు స్టేషన్లు(పలాస, సుమ్మదేవి, మందాస రోడ్, బరువా, సోంపేట, ఝాడుపూడి,ఇచ్చాపురం.) ఉన్నాయని పేర్కొంది. ఇవన్నీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని తెలిపింది.ఈ స్టేషన్లలో ఏదీ కూడా ఒడిశా పరిధిలో లేదని పేర్కొంది.
“ఈ స్టేషన్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీని నిర్వహించే చిన్న నుంచి మధ్య తరహా స్టేషన్లు. వీటిలో ఏదీ ప్రధాన సరుకు రవాణా స్థానం కాదు. అందువల్ల ఈసీఓఆర్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడదు’ అని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
పలాస-ఇచ్ఛాపురం సెక్షన్ పరిధిపై స్పష్టత
ఏ జోన్ కు అధికార పరిధి ఉందనే దానితో సంబంధం లేకుండా సరుకు రవాణా నిరంతరాయంగా కొనసాగుతుందని రైల్వేశాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలు జోనల్ సరిహద్దుల వెంబడి నిరంతరాయంగా ఉండేలా చూస్తాయని వివరించింది.
‘రైళ్ల సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. పలాసా-భువనేశ్వర్, పలాసా-కటక్, ఇచ్చాపురం-కటక్ మెమూ / ప్యాసింజర్ సర్వీసులతో సహా ప్రస్తుతం ఉన్న అన్ని రైళ్లు షెడ్యూల్, మార్గం లేదా ఫ్రీక్వెన్సీలో ఎటువంటి మార్పు లేకుండా నడుస్తాయి” అని రైల్వేశాఖ తెలిపింది.
సిబ్బంది నియామకంతో సహా బదిలీకి సంబంధించిన విధివిధానాలను తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల మధ్య ఖరారు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. నిబంధనల ప్రకారం రైల్వే ఉద్యోగులందరి ప్రయోజనాలు, సేవా నిబంధనలు పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చింది.
తూర్పు కోస్తా రైల్వే ఆదాయంపై ప్రభావం ఉండదా?
ఒడిశా పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధత అచంచలమైనదని రైల్వేశాఖ తెలిపింది. ఒడిశాలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, స్టేషన్ల ఆధునీకరణ, వందే భారత్ సేవలు, తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్‌పై రికార్డు స్థాయిలో మూలధన వ్యయం చేయడం ఈ నిబద్ధతకు నిదర్శనమని గుర్తు చేసింది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రైల్వే శాఖ ప్రకటనతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దులపై నెలకొన్న వివాదాలకు కొంతమేర తెరపడినట్టయింది. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇవ్వడం ఊరటనిచ్చే అంశం.


