|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published: 16-06-2025, 6:18 AM
స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

జియోహాట్‌స్టార్‌లో ప్రేక్షకులను అలరించిన స్పెషల్ ఓపీఎస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ త్వరలో రాబోతోంది. ట్రైలర్ విడుదలై, జులై 11న స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులో ఉంటుంది.

Key Points

1

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 జులై 11న JioHotstarలో స్ట్రీమింగ్ అవుతుంది.

2

ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది, సైబర్ వార్‌తో కూడిన యాక్షన్ చూపిస్తుంది.

4

తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంటుంది.

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 ట్రైలర్ విడుదల

ఓటీటీలో ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి స్పెషల్ ఓపీఎస్ (Special Ops). జియోహాట్‌స్టార్ లో ఇప్పటికే తొలి సీజన్, తర్వాత 1.5 అంటూ మరో షార్ట్ సీజన్ కూడా స్ట్రీమింగ్ అయింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. తాజాగా సోమవారం (జూన్ 16) ట్రైలర్ రిలీజ్ కాగా.. జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు కే కే మేనన్.. హిమ్మత్ సింగ్ అనే పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. ఇప్పుడు రెండో సీజన్ మరింత గ్రాండ్ గా, అదిరిపోయే యాక్షన్ తో రాబోతోంది. జులై 11 నుంచి రెండో సీజన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అంచనాలను మించి సాగింది.

జులై 11న స్ట్రీమింగ్ ప్రారంభం

ఈసారి సైబర్ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచానికి ఏర్పడే ముప్పుతో హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ ఫైట్ చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. డాక్టర్ భార్గవ్ అనే దేశంలోని టాప్ సైంటిస్ట్ కిడ్నాపింగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అతన్ని కాపాడటానికి హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది.

అయితే ఈసారి సైబర్ వార్ వాళ్లకు మరింత సవాలుగా మారుతుంది. సైబర్ వార్ గెలిచే వాళ్లదే ఈసారి విజయం అనే డైలాగ్ హిమ్మత్ సింగ్ నోటి నుంచి రావడం ఈ ట్రైలర్లో చూడొచ్చు. దేశంలో యూపీఐ డేటాబేస్ లక్ష్యంగా సైంటిస్ట్ కిడ్నాప్, తర్వాత కథ సాగబోతున్నట్లు తెలుస్తోంది.

సైబర్ వార్ నేపథ్యం

కే కే మేనన్ లీడ్ రోల్లో నటించిన ఈ స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీని కూడా జియోహాట్‌స్టార్ వెల్లడించింది. జులై 11 నుంచి ఈ కొత్త సీజన్ ను తీసుకురానున్నట్లు తెలిపింది. “ఈసారి ప్రతి ఒక్కరూ లక్ష్యం కాబోతున్నారు. సైబర్ ఉగ్రవాదం వర్సెస్ హిమ్మత్ సింగ్, అతని టీమ్.

హాట్‌స్టార్ స్పెషల్స్ స్పెషల్ ఓపీఎస్ 2 జులై 11 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. తొలి సీజన్ పై పార్లమెంట్ పై దాడి చేసిన ఉగ్రవాదిని పట్టుకునే ప్రయత్నంతో సాగగా.. ఈ రెండో సీజన్ సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, సైబర్ యుగంలోని సవాళ్లను చూపిస్తూ, కే కే మేనన్ నటనతో అలరించనుంది. జులై 11 వేచి చూద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.