|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే: ట్రైలర్ రిలీజ్.. రికార్డులు షురూ! 🔥

Published: 19-03-2026, 8:45 AM
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే: ట్రైలర్ రిలీజ్.. రికార్డులు షురూ! 🔥
  • స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే: జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల!
  • ట్రైలర్ ఆవిష్కరణ: న్యూయార్క్ నగరంలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైన టామ్ హాలండ్ సందడి!
  • నటీనటులు: టామ్ హాలండ్, జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్, జోన్ బెర్న్తాల్!
  • దర్శకుడు: డెస్టిన్ డానియల్ క్రెటన్.. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో!

స్పైడర్ మ్యాన్ అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్! స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో కొత్త సినిమా రాబోతుంది. ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రం యొక్క తెలుగు ట్రైలర్ విడుదలైంది. సినిమా జూలై 31న రిలీజ్ కానుంది.

ట్రైలర్ విడుదల: న్యూయార్క్ లో సందడి!

Spider Man – Brand New Day : స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇప్పుడు మరో కొత్త సినిమా రాబోతుంది. ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. ఇండియాలో కూడా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

తాజాగా స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైన టామ్ హాలండ్ ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ చూస్తుంటే.. నో వే హోమ్ సంఘటనలు జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత పీటర్ తన వాళ్లందరికీ దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో స్పైడర్ మ్యాన్ గా పోరాడుతూ, సిటీని రక్షిస్తున్నాడు. కానీ అతని శారీరక మార్పులు, న్యూయార్క్ నగరంలో జరుగుతున్న వింతైన నేరాలతో పీటర్ ఏం చేస్తాడు అనే విదేశంగా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్!

మీరు కూడా స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే తెలుగు ట్రైలర్ చూసేయండి..

టామ్ హాలండ్ అద్భుతమైన యాక్షన్!

డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్పైడర్-మ్యాన్‌గా టామ్ హాలండ్ మళ్ళీ నటిస్తుండగా, జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్, జోన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో, ట్రామెల్ టిల్మాన్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియాలో ఈ సినిమాని జూలై 31న రిలీజ్ చేస్తుంది.

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రం జూలై 31న విడుదల కానుంది. టామ్ హాలండ్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.