
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. చివరకు ఆ ఉత్కంఠకు తెరపడింది. యానిమల్ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.
Key Points
స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి దిమ్రి ఎంపిక
యాన్నిమల్ సినిమా తర్వాత త్రిప్తికి మరో గోల్డెన్ ఛాన్స్
త్రిప్తి పోలీస్ పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం
త్రిప్తి దిమ్రి స్పిరిట్ లో హీరోయిన్
Spirit Movie : గత కొన్ని రోజులుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు వస్తున్నాయి. దీపికా పదుకోన్ ని ఈ సినిమా నుంచి తీసేశారని, ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ని కూడా అనుకోని ఫైనల్ చేయలేదని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో స్పిరిట్ సినిమా హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్ గా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని రిలీజ్ చేసే అన్ని భాషల్లో త్రిప్తి దిమ్రి పేరుని రాసి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఆల్రెడీ సందీప్ వంగతో యానిమల్ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది త్రిప్తి దిమ్రి. ఇప్పుడు మళ్ళీ సందీప్ ఆమెకే అవకాశం ఇచ్చాడు. ఒక్క యానిమల్ సినిమాతోనే ఇండియా వైడ్ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ.
యాన్నిమల్ తర్వాత స్పిరిట్
ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అవ్వడం ఖాయం. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి కూడా పోలీస్ పాత్రలో కనిపిస్తుందేమో అని చర్చించుకుంటున్నారు. ఇక స్పిరిట్ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మెక్సికో లో మొదలవుతుందని సమాచారం. మొత్తానికి యానిమల్ తో భారీ అదృష్టం రాగా స్పిరిట్ తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది త్రిప్తి దిమ్రి.
The female lead for my film is now official 🙂 pic.twitter.com/U7JJQqSUVa
మెక్సికోలో షూటింగ్
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025
మొత్తంగా, యానిమల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రికి స్పిరిట్ సినిమా మరో పెద్ద అవకాశం. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మరింత ఎత్తునిస్తుందని అంచనా.


