|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పోర్ట్స్ డ్రామాగా ‘వాలి ‘.. టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన డైరెక్టర్ క్రిష్!

Published: 19-04-2026, 6:05 AM
స్పోర్ట్స్ డ్రామాగా ‘వాలి ‘.. టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన డైరెక్టర్ క్రిష్!

Volley Film: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు వివిధ రకాల జోనర్ లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలయ్యి మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. అయితే ఇదివరకు క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ వంటి వివిధ రకాల స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొట్టమొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో వాలీబాల్ నేపథ్యంలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

వాలీబాల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘వాలి’ (Volley) అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ కు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఆవిష్కరించారు.దిలీప్ కె. మనుకొండ(Dilip K.Manu konda) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రోనిత్ జీఆర్‌జీ (Ronith GRG)హీరోగా పరిచయం అవుతున్నారు. ఈయనతో పాటు నిపుణ్‌ సత్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇతనికి కూడా ఇది మొదటి సినిమా కావటం విశేషం. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్‌గా నటిస్తోంది. రవి వర్మ, కల్పలత, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీశాల, కిరణ్ వరణాసి, రమణ భార్గవ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఇలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతుంది. గ్రామీణ నేపథ్యంలోనే ఈ సినిమా కథ మొత్తం సాగిపోతుందని తెలుస్తోంది. ఇద్దరు అన్నదమ్ముల జీవితాల చుట్టూ కొనసాగే ఈ సినిమా ఎన్నో బాగోద్వేగాలు మానవ సంబంధాలకు ప్రతిరూపంగా నిలుస్తుందని చెప్పాలి. ఈ చిత్రాన్ని జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ కారంకి సహ నిర్మాతగా, స్నేహ దాసరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను దిలీప్ కె. మనుకొండ మరియు పవన్ కె. విప్పర్తి సంయుక్తంగా రచించారు.

అంచనాలు పెంచిన టైటిల్ పోస్టర్..

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకు అరుణ్ విజేకే సినిమాటోగ్రఫీ అందించగా ఔరానోవా స్టూడియోస్ సంగీతాన్ని సమకూర్చింది.రవితేజ గిరిజాల ఎడిటర్ గా కొనసాగనున్నారు. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి మరిన్ని విషయాలను చిత్రం నిర్మాతలు అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక టైటిల్ మోషన్ పోస్టర్ తోనే సినిమా మంచి అంచనాలను అందుకుందని చెప్పాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.