|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘రాక’లో అల్లు అర్జున్ నాలుగు పాత్రలు.. అసలు ట్విస్ట్ ఇదే!

Published: 14-07-2026, 6:40 AM
షాకింగ్: 'రాక'లో అల్లు అర్జున్ నాలుగు పాత్రలు.. అసలు ట్విస్ట్ ఇదే!
  • అల్లు అర్జున్ ‘రాక’లో తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలు
  • రూ.800 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ భారీ ప్రొడక్షన్
  • దీపికా, మృణాల్, జాన్వీ, రష్మిక హీరోయిన్లుగా టాక్
  • అట్లీ దర్శకత్వంలో బన్నీ మూవీ 2027 చివర్లో రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బన్నీ ఏకంగా నాలుగు పాత్రలు పోషిస్తున్నారు! ఈ వార్త అభిమానులను థ్రిల్ చేస్తోంది.

బన్నీ నాలుగు పాత్రల్లో మాస్ ఎంట్రీ

ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్” ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం ‘రాకా’. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గానే బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫ్యాన్స్‌ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్.. గుండుతో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ తో లుక్ ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది.

రూ.800 కోట్ల బడ్జెట్ తో అట్లీ మూవీ

ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. తన కెరీర్‌లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించని అల్లు అర్జున్.. ఈ మూవీలో ఏకంగా నాలుగు రోల్స్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటిస్తున్నాడని సమాచారం. ముందుగా మూడు రోల్స్ ను బన్నీతో వేయించాలని అట్లీ అనుకుంటే.. ఆ నాలుగో పాత్ర కూడా తనే చేస్తానని హీరో పట్టుబట్టారట. 2027 చివర్లో మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

2027 చివర్లో రిలీజ్ అవకాశం

మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత బన్నీ.. మల్లు డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీపై వస్తున్న అప్డేట్స్ అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టిస్తున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సినీ అప్డేట్స్ కోసం మాతో ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.