|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sravana Bhargavi: జీవితాన్ని అర్థవంతంగా మార్చేది ప్రేమ ఒక్కటే.. ఎక్కువగా ప్రేమించండి

Published: 30-06-2025, 3:50 AM
Sravana Bhargavi: జీవితాన్ని అర్థవంతంగా మార్చేది ప్రేమ ఒక్కటే.. ఎక్కువగా ప్రేమించండి

టాలీవుడ్‌ గాయని శ్రావణ భార్గవి ప్రేమ గురించి తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు. జీవితంలో ప్రేమ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఎక్కువగా ప్రేమించమని ఆమె అభిమానులకు సూచించారు. హేమచంద్రతో ఆమె సంబంధంపై గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్‌ ప్రాముఖ్యత సంతరించుకుంది.

Key Points

1

శ్రావణ భార్గవి తన జీవితంలో ప్రేమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

2

హేమచంద్రతో విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

4

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రావణ భార్గవి యొక్క ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్స్‌ శ్రావణ భార్గవి ( Ravuri Sravana Bhargavi )- హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడూ వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురితో ఒంటరిగా ట్రిప్స్‌కు వెళ్తోంది శ్రావణ భార్గవి. దీంతో వీరు దాపంత్య జీవితానికి స్వస్తి పలికి, ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది.

తప్పు చేస్తున్నామా? తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్లు.. వీటితోనే బతికేయడంలో అర్థంపర్థం లేదు. ప్రేమ ఒక్కటే అర్థవంతమైనది. మనం మనస్ఫూర్తిగా ఒకర్ని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా? అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు. ఉదారంగా, మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే.. మనం జీవితంలో గెలిచామా? ఓడామా? అనేది నిర్ణయిస్తుంది అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

హేమచంద్రతో విభేదాలు?

హేమచంద్రతో ప్రేమపెళ్లి టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ శ్రావణ భార్గవి.. పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా! అలాగే హీరోయిన్స్‌కు డబ్బింగ్‌ కూడా చెప్తుంది. ‘గబ్బర్‌సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్‌కి డబ్బింగ్ చెప్పింది. ఈగ హిందీ వర్షన్‌లో సమంతకు డబ్బింగ్‌ చెప్పింది. 2013లో సింగర్‌ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి- హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలు చేశారు. ఓ షోలో జడ్జిలుగా కూడా వ్యవహరించారు. లక్కీ లవ్‌ అనే షార్ట్‌ ఫిలింలో జంటగానూ నటించారు.

ప్రేమే జీవిత విజయానికి కీలకం

శ్రావణ భార్గవి ప్రేమను జీవితానికి కీలకమని భావిస్తున్నారు. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రేమతో కూడిన జీవితం ఎంతో అర్థవంతమైనదని ఆమె అభిప్రాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.