
📌 Key Points
- శ్రీలీల నటించిన వరుసగా 10 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
- పవన్ కళ్యాణ్ సినిమాలో శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం విమర్శలకు దారితీసింది.
- టాలీవుడ్ మేకర్స్ శ్రీలీలను ‘ఐరన్ లెగ్’గా ముద్ర వేసే అవకాశం ఉందని టాక్.
- కొత్త తెలుగు సినిమా అవకాశాలు లేకపోవడంతో శ్రీలీల బాలీవుడ్, కోలీవుడ్ పై దృష్టి పెట్టింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో లక్కీ చార్మ్‌గా వెలుగొందిన శ్రీలీల ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. ఆమె నటించిన పలు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. టాలీవుడ్ లో ఆమె పరిస్థితి దిగజారుతోంది.
శ్రీలీల కెరీర్ లో వరుస డిజాస్టర్లు
Sreeleela: టాలీవుడ్‌లో ఒకప్పుడు ‘లక్కీ చార్మ్’ అనిపించుకున్న శ్రీలీల గ్రాఫ్ ఇప్పుడు పాతాళానికి పడిపోతోంది. నిజానికి, ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఈ అమ్మడు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్, టైమింగ్‌తో నడిచే ఈ సినిమాలో శ్రీలీల పాత్ర ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా, సెకండాఫ్‌లో కేవలం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కే ఈమెను పరిమితం చేశారంటే, దర్శకుడు హరీష్ సైతం ఈమెను కేవలం ఒక ‘గ్లామర్ బొమ్మ’గానే చూశారని స్పష్టమవుతోంది. దీని ఫలితంగా, పూజా హెగ్డే లాగే శ్రీలీలకు కూడా టాలీవుడ్ మేకర్స్ ‘ఐరన్ లెగ్’ ముద్ర వేసి పక్కన పెట్టేసే టైమ్ వచ్చేసిందన్న టాక్ వినిపిస్తుంది.
శ్రీలీల గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. ఎందుకంటే, మాస్ జాతర, జూనియర్, రాబిన్ హుడ్, ఎక్స్‌ట్రాడినరీ మ్యాన్, ఆదికేశవ, స్కంద.. ఇలా ఒకటా రెండా? వరుసగా 10 డిజాస్టర్లు ఈమె ఖాతాలో చేరిపోయాయి. నిజానికి, ఒక్క భగవంత్ కేసరి హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం బాలయ్యే పట్టుకుపోగా, శ్రీలీలకు మిగిలింది కేవలం ‘ఫ్లాపుల రాణి’ అనే ట్యాగ్ మాత్రమే. అంతేకాకుండా, కోలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ‘పరాశక్తి’ దారుణమైన రిజల్ట్ ఇవ్వడం, ఆఖరికి తెలుగులో థియేటర్ రిలీజ్ కూడా నోచుకోకుండా నేరుగా ఓటిటి బాట పట్టడం ఈమె కెరీర్ లోని అత్యంత సాడ్ థింగ్. ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించడం ఒక డ్రీమ్ అని చెప్పుకున్నా, ఆ పాత్ర గుర్తుండిపోయేలా లేకపోవడం ఈమె పని అయిపోయిందని చెప్పడానికి నిదర్శనం.
పవన్ కళ్యాణ్ సినిమాతో నిరాశ
ప్రస్తుతానికి శ్రీలీల చేతిలో తెలుగులో కొత్తగా ఒక్క కమిట్‌మెంట్ కూడా లేకపోవడం గమనార్హం. దీనివల్ల, ఈమె ఇప్పుడు బాలీవుడ్ వైపు చూపు మళ్లిస్తోంది. కార్తీక్ ఆర్యన్ సరసన చేస్తున్న మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, మరోవైపు ధనుష్ సరసన చేస్తున్న తమిళ మూవీపై కూడా అస్సలు బజ్ లేదు. నిజానికి, కేవలం డ్యాన్సులు, ఎక్స్ పోజింగ్ నమ్ముకుంటే కెరీర్ సాగదని ఈ చిన్నది ఇప్పటికైనా గ్రహించాలి. లేదంటే, టాలీవుడ్ నుంచి ఈమెకు ఎగ్జిట్ కార్డ్ సిద్ధమైపోయినట్టే. శ్రీలీల ఇక తన తట్టాబుట్టా సర్దుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేయడమే ఉత్తమమని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు కూడా . మరి ఈ ‘బుట్టబొమ్మ’ వారసురాలు ఇప్పటికైనా తన పతనాన్ని ఆపుకుంటుందో లేక పూర్తిగా కనుమరుగవుతుందో చూడాలి!
బాలీవుడ్, కోలీవుడ్ పై ఆశలు
శ్రీలీల తన కెరీర్ ను నిలబెట్టుకోవడానికి నటనపై దృష్టి పెట్టాలని, లేకపోతే టాలీవుడ్ నుంచి నిష్క్రమించక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.


