
తెలుగు సినీ రంగంలో దూసుకుపోతున్న యువ నటి శ్రీలీల, బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ఉన్న ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలకు స్పందించింది. తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె క్లారిటీ ఇచ్చింది.
Key Points
శ్రీలీల ప్రస్తుతం బిజీగా సినిమాలు చేస్తోంది.
కార్తీక్ ఆర్యన్ తో ప్రేమ వ్యవహారంపై రూమర్స్.
శ్రీలీల తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.
30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోనని శ్రీలీల ప్రకటన.
కార్తీక్ ఆర్యన్ తో ప్రేమ వ్యవహారం?
యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ‘జూనియర్’లో వైరల్ వయ్యారిగా తెగ సందడి చేస్తోంది. సరే ఈ సంగతులు పక్కనబెడితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఈమె ప్రేమలో ఉందనే రూమర్స్ గత కొన్నాళ్లుగా గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల ఈ పుకార్లతో పాటు తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.
పెళ్లి ప్రచారంపై స్పందన
‘నేను లవ్ చేస్తున్నానని అంతా అనుకుంటున్నారు. కానీ నేనెలా ప్రేమలో పడగలను. ప్రతిసారి అమ్మ నాతో ఉంటోంది. అయినాసరే నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. లేకలేక మియామీ వెళ్లినప్పుడు కూడా నా వెంట అమ్మ వచ్చింది. అలాంటప్పుడు నేనెలా ప్రేమలో పడతాను చెప్పండి’ అని శ్రీలీల క్యూట్‌గా క్లారిటీ ఇచ్చింది.
కొన్నిరోజుల క్రితం పెళ్లి కూతురిలా రెడీ వాటిని శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అంతా ఈమెకు పెళ్లి అని ఫిక్సయ్యారు. కానీ అది తన పుట్టినరోజు, అలా బుట్టలో తీసుకెళ్లడం తన కుటుంబ సంప్రదాయం అని చెప్పింది. దీంతో కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక పెళ్లి విషయమై స్పందించిన శ్రీలీల.. తనకు ఇప్పుడు 23 ఏళ్లు అని, ఎలా లేదన్నా 30 ఏళ్లు వచ్చేవరకు తను అసలు పెళ్లి చేసుకోనని కూడా చెప్పుకొచ్చింది. మరి అప్పుడైనా ప్రేమ వివాహమా? లేదంటే పెద్దల కుదిర్చిన పెళ్లా అనేది చూడాలి?
శ్రీలీల తన భవిష్యత్తు ప్రణాళికలు
చివరగా, శ్రీలీల తన ప్రేమ, పెళ్లి విషయాలపై స్పష్టతనిస్తూ, తనకు ఇప్పుడు సినిమాలపైనే దృష్టి ఉందని, 30 ఏళ్ళ వరకు పెళ్లి లేదని తెలిపింది. ఆమె భవిష్యత్తు నిర్ణయాలను ఆసక్తిగా ఎదురు చూద్దాం.


