|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీల ఫ్లాప్స్ షాక్! పవన్ కళ్యాణ్ తో అయినా హిట్టు కొడుతుందా? ఉస్తాద్ భగత్ సింగ్ మామూలు సినిమా కాదుగా!!

Published: 12-01-2026, 9:30 PM
శ్రీలీల ఫ్లాప్స్ షాక్! పవన్ కళ్యాణ్ తో అయినా హిట్టు కొడుతుందా? ఉస్తాద్ భగత్ సింగ్ మామూలు సినిమా కాదుగా!!
  • శ్రీలీల కెరీర్ లో వరుస ఫ్లాప్స్, టాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి!
  • తమిళ్ లో పరాశక్తి మూవీతో నిరాశ, సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించినా ఫలితం లేదు.
  • పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ ఆశలు, దేఖ్ లేంగే సాలా సాంగ్ సూపర్ హిట్!
  • ఏప్రిల్ లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల, శ్రీలీల ఫేట్ మారుతుందో లేదో చూడాలి!

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల వరుస ఫ్లాప్ లతో సతమతమవుతోంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపైనే ఆశలన్నీ ఉన్నాయి.

శ్రీలీలకు వరుసగా ఫ్లాప్స్ ఎందుకు?

Sreeleela: శ్రీలీల.. మొన్నటివరకు ఈ బ్యూటీని డాన్సింగ్ స్టార్, లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ అంటూ చాలా రకాల పేర్లతో పిలుచుకున్నారు ఆడియన్స్. కానీ, ఇప్పుడు మాత్రం ఆ బిరుదులన్నీ పోయాయి. అసలు శ్రీలీల అంటేనే భయపడుతున్నారు. అంతలా మారిపోయింది ఆమె ఫేట్. ధమాకా సినిమా తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదు శ్రీలీల(Sreeleela)కి. ఈ సినిమా తరువాత ఆమె అరడజనుకు పైగా సినిమాలు చేసింది.

కానీ, అందులో ఒక్క హిట్ కూడా లేదు. మహేష్ బాబు, రవితేజ, రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్ ఇలా చాలా మంది స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, హిట్ మాత్రం రావడం లేదు. అందుకే, తెలుగు మేకర్స్ ఈ అమ్మడును హీరోయిన్ గా పెట్టుకోవడానికి భయపడుతున్నారు. కనీసం భాష మారితే అయినా హిట్ వస్తుందేమో అని తమిళ్ లో ప్రయతించింది. కానీ, అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్.

తమిళ్ లో కూడా ఫలితం మారలేదా?

ఈ అమ్మడు రీసెంట్ గా చేసిన తమిళ సినిమా పరాశక్తి. ఆకాశమే హద్దురా మూవీ ఫేమ్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న విడుదల అయ్యింది. విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ ఈ సినిమాకు నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దీంతో, ఈ సినిమా కూడా ప్లాప్ లిస్టులోకి చేరిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఆశలన్నీ!

అందుకే, శ్రీలీలపై ఆమె ఫ్యాన్స్ జాలి పడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటలో పవన్ పక్కన డాన్స్ చేస్తూ మెరిసింది శ్రీలీల. మరి ఈ సినిమా అయినా ఆమెకు హిట్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, శ్రీలీల మళ్ళీ బిజీ అయిపోవడం ఖాయం.

శ్రీలీల కెరీర్ ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆమె ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.