|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీలకు గోల్డెన్‌ ఛాన్స్‌.. క్రేజీ హీరోతో రెండు సినిమాలు

Published: 10-10-2025, 9:50 PM
శ్రీలీలకు గోల్డెన్‌ ఛాన్స్‌.. క్రేజీ హీరోతో రెండు సినిమాలు

టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీలకు కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ లభించింది. యువ నటుడు శివకార్తికేయన్‌తో ఆమె వరుసగా రెండు చిత్రాలలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశంతో శ్రీలీల తమిళ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఆమె కోలీవుడ్ ఎంట్రీ వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ శివకార్తికేయన్‌ చిత్రం 'పరాశక్తి'తో ఖరారైంది.

2

'పరాశక్తి' సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్‌ 25వ చిత్రంగా రూపొందుతోంది.

4

రెండు సినిమాల్లో నటించడం నిజమైతే, శ్రీలీల కెరీర్‌కు ఇది పెద్ద అవకాశం.

శివకార్తికేయన్‌తో శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ

ఇటీవల అమరన్‌ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మదరాసి చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను సాధించిన నటుడు శివకార్తికేయన్‌. ఈయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈయన నటిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. నటుడు రవి మోహన్‌ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు అధర్వ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.  టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీల( Sreeleela) కోలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లియర్‌ అయింది. ఈ చిత్రం ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతున్నారు. కాగా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అయిన వెంటనే  సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించబోతున్నారని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్‌లో డాన్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం రూపొందిందన్నది గమనార్హం. ఈ చిత్రం నవంబర్‌ నెలలో సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించనున్నారట.టీ మూవీలో కూడా నటి శ్రీలీల కథానాయకిగా నటించనున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే లేదు. ఇదే గనుక నిజం అయితే ఈ బ్యూటీ బ్యాక్‌ టు బ్యాక్‌ శివకార్తికేయన్‌తో సినిమాలు చేసిన హీరోయిన్‌గా గుర్తింపు పొందుతుంది.

‘పరాశక్తి’తో తమిళ ప్రేక్షకులకు పరిచయం

బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు చిత్రాలు: అధికారిక ప్రకటన?

మొత్తం మీద, శ్రీలీలకు శివకార్తికేయన్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాలలో నటించే అవకాశం ఆమె కెరీర్‌కు గోల్డెన్ బూస్ట్‌ ఇవ్వనుంది. ఈ వార్తలు నిజమైతే ఆమె కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడటం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.