|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sreeleela: అఖిల్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్?

Published: 25-06-2025, 12:23 AM
Sreeleela: అఖిల్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్?

తెలుగు సినిమా పరిశ్రమలో బిజీగా ఉన్న శ్రీలీల, అఖిల్ నటించే ‘లెనిన్’ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటోంది. కానీ, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Key Points

1

శ్రీలీల అఖిల్ సినిమా 'లెనిన్' లో నటిస్తోంది.

2

హిందీ, తమిళ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సినిమా నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంది.

4

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' లో కూడా శ్రీలీల నటిస్తోంది.

శ్రీలీల బిజీ షెడ్యూల్

కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో వరస సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొత్త మూవీస్ చేస్తోంది. సరైన హిట్స్ పడట్లేదు గానీ ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్‌గా కొనసాగుతోందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈమె.. అఖిల్ సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేంటి విషయం?

శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ అనే మూవీ కూడా చేస్తోంది. ఈ ఏప్రిల్‌లో అఖిల్-శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. దీపావళికి మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్‌ని చూసుకోవాలని టీమ్ భావిస్తుందట.

‘లెనిన్’ సినిమా షూటింగ్

శ్రీలీల చివరగా తెలుగులో ‘రాబిన్ హుడ్’ మూవీలో కనిపించింది. త్వరలో ‘మాస్ జాతర’ చిత్రంతో రాబోతుంది. ఇది కాకుండా పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ ఈమెనే హీరోయిన్. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. హిందీలో ఆషికి 3, తమిళంలో ‘పరాశక్తి’ చేస్తోంది. ఈమె నటించిన కన్నడ చిత్రం ‘జూనియర్’ రిలీజ్ కావాల్సి ఉంది.

మరో హీరోయిన్ ఎంపిక?

శ్రీలీల బిజీ షెడ్యూల్ కారణంగా ‘లెనిన్’ సినిమా నుంచి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చివరి నిర్ణయం త్వరలోనే వెల్లడవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.