|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sreeleela: ఉస్తాద్ మూవీ నెక్స్ట్ లెవల్.. పవన్ కళ్యాణ్ అలా.. హైప్ ఎక్కిస్తున్న శ్రీలీల కామెంట్స్..

Published: 27-10-2025, 12:20 PM
Sreeleela: ఉస్తాద్ మూవీ నెక్స్ట్ లెవల్.. పవన్ కళ్యాణ్ అలా.. హైప్ ఎక్కిస్తున్న శ్రీలీల కామెంట్స్..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన కొత్త సినిమాల గురించి మాట్లాడింది. రవితేజతో ఆమె నటించిన మాస్ జాతర నవంబర్ 1న విడుదల కానుంది. అయితే, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Key Points

1

శ్రీలీల, రవితేజ జంటగా నటించిన 'మాస్ జాతర' నవంబర్ 1న విడుదల కానుంది.

2

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది.

4

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చే ఏడాది శివరాత్రికి 'ఉస్తాద్' రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

మాస్ జాతర విడుదల తేదీ, ప్రమోషన్స్

Sreeleela: డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల, మాస్ మహారాజ్ రవితేజ జంటగా వస్తున్న మూవీ మాస్ జాతర. పేరుకు తగ్గట్టుగానే (Sreeleela)మాస్ అంశాలు పుష్కలంగా ఉండనున్నాయి ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆ మ్యాటర్ క్లియర్ గా అర్థమయ్యింది. రవి తేజ నుంచి ఎలాంటి అంశాలు ఆడియన్స్ కోరుకుంటారో అలా పక్కాగా ప్రిపేర్ చేసి ఈ సినిమాను దించుతున్నాడు దర్శకుడు భాను భోగవరపు. అందుకే ఈ సినిమాపై ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. రవి తేజ గత చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Priyanka Jain: శారీలో సీరియల్ బ్యూటీ అందాలు.. ప్రియాంక జైన్ క్యూట్ ఫోటోలు

ఉస్తాద్ భగత్ సింగ్ పై శ్రీలీల కామెంట్స్

ఇక సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ శ్రీలీల. మాస్ జాతర సినిమా గురించి కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే తాను నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచానాలు కూడా భారీగానే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే!

తాజాగా ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారా ఉస్తాద్ భగత్ సింగ్ అలా ఉంటుంది. బోలెడంత ఎంటర్ టైన్మెంట్ తోపాటు యాక్షన్ కూడా ఉంటుంది. గతంలో ఎన్నడు చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుంది” అంటూ సినిమాపై భారీ హైప్ ఇచ్చింది శ్రీలీల. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓజీ తరువాత మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దర్శకుడు హరిశ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

శ్రీలీల కామెంట్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలను మరింత పెంచాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది శివరాత్రికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.