|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీల సంచలన ప్రకటన: ఆ కఠిన నిర్ణయం ఆయన కోసమే! పుష్ప-2పై షాకింగ్ నిజం!

Published: 07-01-2026, 2:45 AM
శ్రీలీల సంచలన ప్రకటన: ఆ కఠిన నిర్ణయం ఆయన కోసమే! పుష్ప-2పై షాకింగ్ నిజం!
  • శ్రీలీల, శివకార్తికేయన్ జంటగా ‘పరాశక్తి’ సంక్రాంతికి సిద్ధం!
  • సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న శివకార్తికేయన్ 25వ చిత్రం.
  • ‘పుష్ప-2’లో ‘కిస్సిక్’ సాంగ్ పై శ్రీలీల సంచలన నిజాలు!
  • ఐటెం సాంగ్ తనకు ఇష్టం లేదని చెప్పిన డాన్సింగ్ క్వీన్!

శ్రీలీల కొత్త సినిమా ‘పరాశక్తి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ‘పుష్ప-2’లో ఐటెం సాంగ్ గురించి, దాని వెనుక ఉన్న ఆసక్తికర నిర్ణయం గురించి ఆమె చెప్పిన నిజాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి!

పరాశక్తి: శ్రీలీల కొత్త అవతార్!

డాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ‘పరాశక్తి’ (Parashakti)మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో శివకార్తికేయన్ (Sivakarthikeyan)సరసన రొమాన్స్ చేయనుంది. ఇది ఆయన కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో రాబోతుండగా.. రవి మోహన్, అథర్వ మురళి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఐటమ్ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ కేవలం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ కోసం మాత్రమే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. నేను హీరోయిన్‌గా చేసే సినిమాలలో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతాను.

పుష్ప-2 ఐటెం సాంగ్: వెనకున్న అసలు కథ!

కానీ ఐటమ్ సాంగ్స్ చేయడానికి కాదు. నాకు అలాంటివి చేయడం అస్సలు నచ్చదు.. కానీ పుష్పలో డ్యాన్స్ చేయాలనే నా నిర్ణయం సరైనదే అని నిరూపించుకున్నా అనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని వల్ల నాకు ఊహించినంత గుర్తింపు లభించింది. నేను నటించిన ‘పరాశక్తి’లో రత్నమాల వంటి తేలికపాటి డ్యా్న్స్ స్టెప్స్ ఉన్నాయి కానీ స్పెషల్ సాంగ్ లేదు’’ అని చెప్పింది. కాగా.. శ్రీలీల ‘పుష్ప-2’లో చేసిన ‘కిస్సిక్’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస ఫ్లా్పులతో సతమతమవుతున్న శ్రీలీలకు అది గోల్డెన్ ఆఫర్ అని చెప్పొచ్చు ఈ సినిమా తర్వాత అమ్మడుకి ప్రపంచవ్యాప్తంగా ఫాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా సినీ కెరీర్ పరంగా కూడా కలిసొచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది.

గోల్డెన్ ఆఫర్ నుండి గ్లోబల్ స్టార్‌డమ్!

A post shared by SREELEELA (@sreeleela14)

శ్రీలీల కెరీర్‌లో ‘పుష్ప-2’ ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. ఆమె ధైర్యమైన నిర్ణయంతో స్టార్‌డమ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘పరాశక్తి’ మరియు ఆమె తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం ఎదురుచూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.