|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sri Chidambaram: శ్రీ చిదంబరం టీజర్ ఎలా ఉందంటే?

Published: 08-10-2025, 3:54 PM
Sri Chidambaram: శ్రీ చిదంబరం టీజర్ ఎలా ఉందంటే?

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్టల ‘శ్రీ చిదంబరం’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాను టీజర్ లో చూపించారు. ఇది ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Key Points

1

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన 'శ్రీ చిదంబరం' టీజర్ విడుదలైంది.

2

హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

4

హీరో పేరు, కళ్లద్దాల వెనుక ఉన్న కారణంపై ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘శ్రీ చిదంబరం’ టీజర్ విడుదల వేడుక

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీ చిదంబరం’. వినయ్ రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి.. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ‘శ్రీ చిదంబరం’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

టీజర్ విషయానికి వస్తే.. ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాను ఎంతో అందంగా చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో హీరోకి ఉన్న అసలు పేరు కాకుండా.. ఊరంతా కూడా చిదంబరం అని పిలుస్తుంటారు.. మరి అలా ఎందుకు పిలుస్తారు? అసలు హీరో ఎప్పుడూ కూడా కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అలా చేయడానికి గల కారణం ఏంటి? అనే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా, సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది.

టీజర్ హైలైట్స్: ప్రేమ కథ, విలేజ్ డ్రామా

ఆసక్తి రేపుతున్న హీరో పాత్ర

మొత్తంగా, ‘శ్రీ చిదంబరం’ టీజర్ ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ప్రేమ కథ, గ్రామీణ నేపథ్యం కొత్త అనుభూతిని పంచనున్నాయని తెలుస్తోంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.