
📌 Key Points
- శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం రాముడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు.
- పెసరపప్పు వేడిని తగ్గిస్తుంది, పానకం శరీరాన్ని చల్లబరుస్తుంది.
- ఈ రోజున పెద్దలను దూషించకూడదు, ఎవరితోనూ గొడవలు పడకూడదు.
- శ్రీరామనవమి నాడు శ్రీరామ కథను వినడం వలన శుభం జరుగుతుంది.
శ్రీరామనవమి అనేది శ్రీరాముని జన్మదినం. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. రాముడికి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం.
శ్రీరామనవమి విశిష్టత
శ్రీరాముడు న్యాయం, ధర్మం, సత్యం, ప్రేమలకు ప్రతిరూపం. శ్రీరాముని ఆదర్శ పురుషుడిగా ఆరాధిస్తాము. అలాగే, శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండి రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊర్లలో ఉండే రామాలయాలు అన్నీ కూడా ప్రత్యేక పూజలతో భక్తులతో కళకళ్ళాడతాయి. శ్రీరామనవమి నాడు శ్రీరామ కథను చదువుతారు.
ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిని జరుపుకుంటాము. శ్రీరామనవమి అనేది రాముడు జన్మించిన రోజు. రాముడు విష్ణుమూర్తి అవతారం. శ్రీరాముడు న్యాయం, ధర్మం, సత్యం, ప్రేమలకు ప్రతిరూపం. శ్రీరాముని ఆదర్శ పురుషుడిగా ఆరాధిస్తాము. అలాగే, శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండి రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊర్లలో ఉండే రామాలయాలు అన్నీ కూడా ప్రత్యేక పూజలతో భక్తులతో కళకళ్ళాడతాయి.
శ్రీరామనవమి నాడు శ్రీరామ కథను చదువుతారు. శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈరోజు ప్రత్యేకించి రాముడికి వడపప్పు నైవేద్యంగా పెడతారు. అయితే, రాముడికి ఎందుకు శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి? దాని వెనుక రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వడపప్పు, పానకం ప్రాముఖ్యత
పెసరపప్పు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ రామనవమి వేసవిలో రావడంతో ఈ పదార్థాలు మంచివని నైవేద్యంగా సమర్పిస్తారు. పానకాన్ని బెల్లం నీటితో కలిపి తయారుచేస్తారు. అలాగే యాలకులు, మిరియాలు లాంటివి కూడా కలుపుతారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది . ఈ నైవేద్యాలను శ్రీరాముడికి శ్రీరామనవమి నాడు సమర్పిస్తే, రాముని అనుగ్రహాన్ని పొందవచ్చని కూడా భక్తుల నమ్మకం. అందుకే పండ్లు, ఇతర నైవేద్యాలతో పాటు ఈ రెండింటినీ కూడా తప్పక పెడతారు.
శ్రీరామనవమి నాడు పెద్దవారిని దూషించడం, తిట్టడం, కోపానికి గురవడం మంచిది కాదు.
శ్రీరామనవమి నాడు చేయకూడని పనులు
గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి కూడా శ్రీరామనవమి నాడు చేయకూడదు.
శ్రీరామనవమి నాడు భార్యా భర్తలు గొడవ పడడం వంటివి చేయకూడదు. ఎవరితోనూ తగాదాలు పడకూడదు. ఇతరుల వ్యవహారాల్లో దూరితే రామయ్యకు కోపం వస్తుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు కలుగుతాయి.
ఈ శ్రీరామనవమి పర్వదినాన శ్రీరాముని ఆశీస్సులతో మీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటూ శుభం భూయాత్!


