|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ స్టార్‌ అంటూ శ్రీవిష్ణుకు ‘బిరుదు’.. నెట్టింట హంగామా.. ఇంతకీ ఏంటా పేరు..?

Published: 10-05-2025, 2:07 PM
ఆ స్టార్‌ అంటూ శ్రీవిష్ణుకు 'బిరుదు'.. నెట్టింట హంగామా.. ఇంతకీ ఏంటా పేరు..?

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. తాజాగా ఆయనకు ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే బిరుదు లభించింది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Key Points

1

శ్రీవిష్ణుకు 'కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్' బిరుదు

2

'సింగిల్' సినిమా కోసం ఈ ప్రత్యేక గుర్తింపు

4

అభిమానుల నుండి అపారమైన స్పందన

శ్రీవిష్ణుకు కొత్త బిరుదు

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీవిష్ణు! మామూలు క్రేజ్ కాదు ఆయనది… ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కుర్రాడు. ఆయన సినిమా వస్తుందంటే చాలు… ఇదిగో వినోదం అని ఫిక్సయిపోతారు ప్రేక్షకులు. తన టాలెంట్‌తో అలా ఓ రేంజ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.. టాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోల జాబితాలో కచ్చితంగా ముందుంటాడు.. ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేస్తాడు. కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్విస్తాడు. పంచ్ డైలాగులు, వన్ లైనర్స్‌తో ప్రేక్షకులను హోరెత్తిస్తాడు. అడల్ట్ జోకులు వేసినా ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో వాటిని తన మాటల్లో కలిపేస్తాడు. స్టార్ హీరోల డైలాగులను తన ప్రత్యేక శైలిలో అనుకరిస్తాడు. కొన్ని వైరల్ స్టెప్పులు కూడా వేసి అలరిస్తాడు.

సినీ ప్రియులు ఆయన చేసే ఈ విన్యాసాలకు ఇట్టే ఆకర్షితులవుతారు. అలా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరినీ కట్టిపడేస్తాడు. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’, ‘స్వాగ్’… ఇప్పుడు ‘సింగిల్’ చిత్రంతోనూ వినోదాల జల్లు కురిపిస్తున్నాడు. అలాంటి శ్రీవిష్ణుకు ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ట్యాగ్ ఇస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా సరిపోతుంది కదా.. ఇప్పుడు అదే జరిగింది.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోల పేర్ల ముందు ట్యాగ్ ఉండటం కామన్ విషయమే. కానీ ఆ ట్యాగ్ ఆ హీరోకు సరిగ్గా సూట్ అయితే మాత్రం అది వేరే లెవెల్! ఇప్పుడు శ్రీవిష్ణు విషయంలో సరిగ్గా అదే జరిగింది. తన రీసెంట్ మూవీ ‘సింగిల్’ కోసం మేకర్స్ ఆయన్ని ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’గా పరిచయం చేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తారు.

‘సింగిల్’ సినిమా ప్రభావం

ఆందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన ట్యాగ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. “సరైన ట్యాగ్ ఇచ్చారు భయ్యా” అంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. “ఆప్ట్‌గా సెట్ అయింది” అని అంటున్నారు. “వినోదాల రారాజు మన శ్రీవిష్ణు” అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో హంగామా చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చర్చ

అయితే ‘సింగిల్’ మూవీ రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌లోని ఆయన పంచ్ డైలాగులకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టేశాడని చెబుతున్నారు. వెన్నెల కిషోర్‌తో ఉన్న సీన్స్ అయితే అదుర్స్ అని అంటున్నారు. థియేటర్లలో నవ్వుల పంట పండుతోందని కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి, ఈ ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ తన రాబోయే చిత్రాలతో ఇంకెంతగా అలరిస్తాడో..

శ్రీవిష్ణు యొక్క అద్భుతమైన నటన మరియు కామెడీ టైమింగ్ కు ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ బిరుదు చాలా సముచితం. ‘సింగిల్’ సినిమాతో ఆయన మరోసారి ప్రేక్షకులను అలరించాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.