|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’: రామ్ రిలీజ్ చేసిన సాంగ్ తో రికార్డులు షురూ! దుమ్ము రేపే అప్డేట్!

Published: 25-02-2026, 3:35 PM
శ్రీ విష్ణు 'మృత్యుంజయ్': రామ్ రిలీజ్ చేసిన సాంగ్ తో రికార్డులు షురూ! దుమ్ము రేపే అప్డేట్!
  • శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ మూవీ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్ విడుదలైంది!
  • రామ్ పోతినేని చేతుల మీదుగా ‘ఈ జిందగీ’ పాట రిలీజ్ – భారీ రెస్పాన్స్!
  • అభినవ్ కవి కృష్ణ కాంత్ లిరిక్స్, కాలభైరవ సంగీతం అందించిన ఈ పాట ఒక సెన్సేషన్!
  • మార్చి 6న ‘మృత్యుంజయ్’ విడుదల – శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందా?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తన డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ‘మృత్యుంజయ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది.

రామ్ పోతినేని రిలీజ్ చేసిన ‘ఈ జిందగీ’ సాంగ్!

టాలీవుడ్ యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. అది తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా శ్రీ విష్ణు ఎదిగారు. అయితే అలాంటి శ్రీ విష్ణు డిఫరెంట్ కథాంశాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మృత్యుంజయ్ అనే సినిమాతో కాబోతున్నారు. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ అందరినీ ఆకట్టు కుంటోంది.

శ్రీ విష్ణు హీరోగా చేసిన మృత్యుంజయ్ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ జిందగీ అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ సినిమా బృందానికి రామ్ పోతినేని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ పాటకు అభినవ కవి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఆదిత్య అయ్యంగార్ ఈ పాటను పాడారు. కాలభైరవ ఈ పాటకు కంపోజ్ చేశారు. కాగా శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ సినిమా మార్చి ఆరవ తేదీన రిలీజ్ కానుంది.

కాలభైరవ మ్యూజిక్ తో శ్రీ విష్ణు దుమ్మురేపే స్టెప్పులు!

మార్చి 6న థియేటర్లలో మృత్యుంజయ్ మూవీ రిలీజ్!

మృత్యుంజయ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీ విష్ణు కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.