
📌 Key Points
- శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబోలో మరో బ్లాక్ బస్టర్ మూవీ!
- మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీగా రూపొందనున్న సినిమా!
- ‘సామజవరగమన’ తర్వాత మళ్లీ కలిసిన హిట్ కాంబినేషన్!
- ఫుల్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం!
శ్రీ విష్ణు తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హిట్ కాంబినేషన్ రిపీట్!
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు గతేడాది ‘సింగిల్’తో ప్రేక్షుకుల ముందుకు వచ్చి పెద్దగా మెప్పించలేక పోయాడు. తర్వాత హిలేరియస్ జాయ్‌రైడ్ ‘విష్ణు విన్యాసం’తో అలరించాడు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా నటించింది. రిలీజ్‌కు ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ కాగా.. కచ్చితంగా హిట్ సొంతం చేసుకుంటుంది అని భావించారు అంతా. ఇక పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఫిబ్రవరి 27న రిలీజైన ఈ సినిమా కూడా శ్రీ విష్ణుకి అంతగా కలిసి రాలేదు.
ఇలా వరుస పరాజయాలు చవిచూస్తున్న విష్ణు ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రామ్ అబ్బరాజుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామజవరగమన’ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లోనే సినిమా రాబోతుందంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా స్టార్ట్ అయింది. ఇది ఫుల్ ఫన్ ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మూవీ
ఫుల్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా!
శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


