|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sridevi Birthday: అతిలోక సుందరి శ్రీదేవి జయంతి.. ఈ విషయం తెలుసా?

Published: 13-08-2025, 1:13 AM
Sridevi Birthday: అతిలోక సుందరి శ్రీదేవి జయంతి.. ఈ విషయం తెలుసా?

టాలీవుడ్‌లో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి జయంతి నేడు. బాలనటిగా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా రాణించిన శ్రీదేవి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

Key Points

1

శ్రీదేవి జయంతి వేడుకలు!

2

బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన శ్రీదేవి

4

శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ.

శ్రీదేవి: అద్భుతమైన సినిమా ప్రస్థానం

టాలీవుడ్‌లో ఇప్పటివరకు వందలాది మంది హీరోయిన్లు వచ్చారు, వస్తూనే ఉన్నారు. కానీ శ్రీదేవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం వేరే లెవల్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ అతిలోక సుందరి అలా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమైన ఈమె.. ప్రమాదవశాత్తు తనువు చాలించడం మాత్రం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేని చేదు జ్ఞాపకం. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె సృష్టించిన క్రేజీ రికార్డ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

1963 ఆగస్టు 13న తమిళనాడులో పుట్టింది శ్రీదేవి. అయితే ఈమె అసలు పేరు ఇది కాదు. శ్రీ అమ్మ అయ్యంగర్. నాలుగేళ్ల వయసులోనే ఓ తమిళ సినిమాలో నటించింది. అప్పుడు తన స్క్రీన్ నేమ్ శ్రీదేవిగా మార్చుకుంది. 1970 నుంచి అయితే వరసగా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ మూవీస్ చేస్తూనే ఉంది. అలా దాదాపు 200కి పైగా చిత్రాలు చేసి తిరుగులేని హీరోయిన్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది.

బాలనటి నుండి అగ్ర హీరోయిన్ వరకు

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘మా బంగారక్క’.. తెలుగులో హీరోయిన్‌గా శ్రీదేవికి తొలి సినిమా. కానీ రాఘవేంద్రరావు తీసిన ‘పదహారేళ్ల వయసు’ మూవీ ఈమెని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. అక్కడి నుంచి మొదలుపెడితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ శ్రీదేవి వరసపెట్టి సినిమాలు చేసింది. అద్భుతమైన హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.

అయితే శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది కదా.. అప్పట్లో పలువురు స్టార్ హీరోలకు మనవరాలు, కూతురిగా చేసిన ఈమె.. పెరిగి పెద్దయిన తర్వాత ఒకరిద్దరు అదే హీరోల పక్కన హీరోయిన్‌గానూ చేయడం విశేషం. ఈ రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ ఏ హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేరేమో? అంటే ఈ ఘనత మాత్రం ఎప్పటికీ శ్రీదేవి సొంతం.

శ్రీదేవి కుటుంబం

శ్రీదేవికి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు. కానీ వీళ్లిద్దరూ నటించడం చూడకుండానే శ్రీదేవి మరణించింది. బహుశా ఇదొక్కటే ఈమెకు తీరనిలోటు అని చెప్పొచ్చు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి.. ప్రమాదవశాత్తు మరణిస్తే అదే ఏడాది జూలై ఈమె పెద్ద కూతురు జాన్వీ తొలి సినిమా రిలీజైంది. ఇప్పుడు జాన్వీ.. హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.

శ్రీదేవి మనసుల్లో నిలిచిపోయిన అపురూప నటి. ఆమె సినిమాలు, జీవితం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా ఉంటాయి. ఆమె జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.