|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sridevi – Roshan: ‘కోర్ట్‌’ జంట కొత్త మూవీ.. పక్కా తెలంగాణ యాసలో..

Published: 17-09-2025, 1:45 AM
Sridevi - Roshan: 'కోర్ట్‌' జంట కొత్త మూవీ.. పక్కా తెలంగాణ యాసలో..

‘కోర్ట్‌’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రోషన్‌ మరియు శ్రీదేవి జంట, తమ కొత్త సినిమా ‘బ్యాండ్‌మేళం’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. తెలంగాణ యాసలో సాగే సంభాషణలు ఈ సినిమా ప్రత్యేకత.

Key Points

1

'కోర్ట్‌' సినిమా జంట రోషన్‌, శ్రీదేవి మరో సినిమాలో జత కట్టారు.

2

బ్యాండ్‌మేళం సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది.

4

రోషన్‌ డ్యాన్స్ నేపథ్యం, శ్రీదేవి సోషల్ మీడియా ప్రభావం.

‘కోర్ట్‌’ జంట కొత్త ప్రాజెక్ట్

‘కోర్ట్‌’ సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్‌ ( Harsh Roshan )-శ్రీదేవి ( Sridevi ) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్‌మేళం ( Band Melam Movie ). సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రోషన్‌.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్‌ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్‌ వినిపించాడు.

మాస్‌ డైలాగ్స్‌ అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్‌ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్‌ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్‌ ఇచ్చాడు.

తెలంగాణ యాస ప్రధాన ఆకర్షణ

సినిమా అరవింద సమేత, వెంకీ మామ, సలార్‌, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్‌, సరిపోదా శనివారం, మిషన్‌ ఇంపాజిబుల్‌.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్‌ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్‌ మీడియాలో ఆమె రీల్స్‌ చూసి తనను కోర్ట్‌ మూవీకి సెలక్ట్‌ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్‌తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది.

రోషన్‌, శ్రీదేవి నటన

తెలంగాణ యాసతో కూడిన ‘బ్యాండ్‌మేళం’ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోషన్ మరియు శ్రీదేవి జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.