
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించిన ‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తాజాగా, ఈ సినిమా షూటింగ్ జ్ఞాపకాలను పంచుకుంటూ శ్రీనిధి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
Key Points
హిట్ 3 సినిమా సక్సెస్‌ను శ్రీనిధి శెట్టి జరుపుకుంటోంది.
శ్రీనిధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో హిట్ 3 చిత్ర బృందం గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఈ పోస్ట్‌లో ఆమె చిత్ర బృందాన్ని మిస్ అవుతున్నట్లు తెలిపింది.
హిట్ 3 సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
శ్రీనిధి శెట్టి ఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ నటించి హిట్ 3 చిత్రం విడుదలై.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే వందకోట్ల కలెక్షన్లు దాటింది. నాని అయితే యాక్షన్‌తో ఇరగదీశాడనడంలో అతిశయోక్తిలేదు. ఇక కన్నడ బ్యూటీ శ్రీనిధి కూడా తన అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న విషయం తెలిసిందే.
హిట్ 3 చిత్ర బృందంపై ప్రేమ
అయితే తాజాగా ఈ హిట్ 3 బ్యూటీ శ్రీనిధి శెట్టి సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానులతో ఓ పోస్ట్ పంచుకుంది. హిట్ 3 చిత్ర బృందాన్ని మిస్ అయినట్లు అందుకు సంబంధించిన పలు మెమోరీస్‌ను పంచుకుంటూ ఇలా రాసుకొచ్చింది. ‘‘సరే, చివరికి నేను నా ఫోటో డంప్‌లతో ప్రారంభించాను. ఇది ఏదో ఒకవిధంగా వీడ్కోలు పలికినట్లు అనిపించింది. అది సరైనదే & బహుశా నేను కోరుకోలేదు.
అయినప్పటికీ, ఇక్కడే ఇది ప్రారంభమవుతుంది. నా గ్యాలరీ మీది. నిజంగా ఇవన్నీ సరిపోలేవు, కానీ నేను కనీసం 20 స్లయిడ్‌లతో ప్రయత్నించాను. నా ఉత్తమ వ్యక్తులతో ఉత్తమ సమయాలు.. #HIT3 🇺🇸 #కృతజ్ఞతగల ప్రేమ & ప్రేమ మాత్రమే’’ అంటూ రాసుకొచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్
A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty)
శ్రీనిధి శెట్టి హిట్ 3 చిత్ర బృందంతో గడిపిన అనుభవాన్ని, వారితో కలిగిన అనుబంధాన్ని ఈ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. సినిమా విజయం తర్వాత ఈ పోస్ట్ అభిమానులను కదిలించింది.


