|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SriTeja Health Update : అల్లు అర్జున్ FD చేశారు : శ్రీతేజ తండ్రి

Published: 01-05-2025, 11:14 AM
SriTeja Health Update : అల్లు అర్జున్ FD చేశారు : శ్రీతేజ తండ్రి

గత డిసెంబర్ లో జరిగిన పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అతని తండ్రి ఇచ్చిన సమాచారం ప్రకారం…

Key Points

1

పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు.

2

శ్రీతేజ నెమ్మదిగా కోలుకుంటున్నాడు, ప్రస్తుతం రిహాబిలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు.

4

ఆసుపత్రి వైద్య ఖర్చులను అల్లు అర్జున్ భరించారు.

శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి

గత డిసెంబరులో పుష్ప 29Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట(Sandhya Theater Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) కొనప్రాణంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన శ్రీతేజ దాదాపు నాలుగు నెలల చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. కాగా ప్రస్తుతం శ్రీతేజ హెల్త్ అప్డేట్ పై బాలుని తండ్రి భాస్కర్ వివరాలు తెలియజేశారు. శ్రీతేజ నెమ్మదిగా కోలుకుంటున్నాడని అన్నారు.

డాక్టర్ల సూచనతో ప్రస్తుతం రిహాబిలేషన్ సెంటర్ కి తీసుకు వచ్చామని, గతంతో పోలిస్తే ఇంకో పావువంతు ఆరోగ్యం నయం అయిందన్నారు. ఫిజియోథెరపీ చేయిస్తే మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారని అన్నారు. కాగా ఇచ్చిన మాట ప్రకారం అల్లు అర్జున్(Allu Arjun) శ్రీతేజ పేరిట డబ్బులు FD చేశారని వెల్లడించారు. ఆసుపత్రి వైద్య ఖర్చులు అన్నీ వారే భరించారని తెలిపారు.

అల్లు అర్జున్ చేసిన సహాయం

రిహాబిలిటేషన్ చికిత్స

శ్రీతేజ కోలుకుంటున్నాడని, అల్లు అర్జున్ ఆర్థిక సహాయం చేశారని తెలుస్తోంది. తొందరలోనే పూర్తి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షిద్దాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.