|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SSMB 29: మహేష్ బాబుతో జక్కన్న ప్లాన్ అదుర్స్..టాలీవుడ్ లోనే తొలిసారి !

Published: 16-07-2025, 9:05 AM
SSMB 29: మహేష్ బాబుతో జక్కన్న ప్లాన్ అదుర్స్..టాలీవుడ్ లోనే తొలిసారి !

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు నటించే SSMB29 చిత్రంపై తాజా అప్డేట్స్ వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు చేస్తున్న ప్రత్యేకమైన పని ఏమిటంటే…

Key Points

1

మహేష్ బాబు SSMB29 చిత్రంలో అన్ని ఫైటింగ్ సీన్స్, స్టంట్స్ స్వయంగా చేస్తున్నారు.

2

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లకు పైగా ఉండొచ్చు.

4

SSMB29 చిత్రం రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

మహేష్ బాబు స్వయంగా స్టంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. ఇప్పటికి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. ఏజ్ పైబడినప్పటికీ… యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకు వెళ్తున్నారు. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

1000 కోట్లకు పైగా బడ్జెట్

SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్… ఈ సినిమాకు పెడుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అతి త్వరలోనే ఈ సినిమా గురించి కీలక అప్డేట్స్ వస్తాయి.

ప్రియాంక చోప్రా హీరోయిన్ గా?

అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో గతంలో ఏ దర్శకుడు.. మహేష్ బాబుతో చేయని రిస్క్ ను జక్కన్న చేయిస్తున్నాడట. ఈ సినిమాలో… ఫైటింగ్ సీన్స్ అలాగే స్టంట్స్ అన్నీ కూడా మహేష్ బాబు మాత్రమే చేస్తున్నారట. మరో వ్యక్తితో… చేయించడం లేదని తెలుస్తోంది. అంటే స్టంట్ డబుల్ కు ఈ సినిమాలో ఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్రతి సీన్ మహేష్ బాబు తోనే చేయించబోతున్నారట రాజమౌళి. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ బాబు స్వయంగా స్టంట్స్ చేయడం సినిమాకు మరింత ఆకర్షణను తీసుకువస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.