
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా నుంచి ఊహించని సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. ఈనెల 15న భారీ ఈవెంట్‌కు ముందు, ఎలాంటి ప్రకటన లేకుండా ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ పాడటం విశేషం.
Key Points
ఈనెల 15న హైదరాబాద్‌లో SSMB29 భారీ ఈవెంట్ జరగనుంది.
రాజమౌళి ఎలాంటి ప్రకటన లేకుండా 'గ్లోబ్ ట్రాటర్' అనే SSMB29 పాటని రిలీజ్ చేశారు.
ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ పాడటం విశేషం.
విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌పై ట్రోల్స్ వస్తున్నాయి.
SSMB29 ఈవెంట్ వివరాలు, సర్‌ప్రైజ్ అప్‌డేట్స్
ఇన్నిరోజులు అసలు సినిమా తీస్తున్న విషయమే బయటకు రానీయకుండా జాగ్రత్తపడిన రాజమౌళి.. ఇప్పుడు మాత్రం అన్ని సడన్ సర్‌ప్రైజులు ఇస్తున్నాడు. ఈనెల 15న హైదరాబాద్‌లో మహేశ్ బాబు ‘SSMB29’ మూవీకి సంబంధించి భారీ ఈవెంట్ జరగనుంది. దీన్ని హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మహేశ్, ప్రియాంక చోప్రా వీడియో బైస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు.
“గ్లోబ్ ట్రాటర్” పాట రిలీజ్: ప్రత్యేకతలు ఏంటి?
అలానే కొన్నిరోజుల క్రితం ఇదే సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కుంభ పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీల్ ఛైర్‌లో ఉన్న పృథ్వీరాజ్ లుక్‌పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పాటని రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రుతి హాసన్ దీన్ని పాడటం విశేషం.
శ్రుతి హాసన్ పాడిన పాట: సినిమాలో ఉంటుందా?
‘సంచారి.. సంచారి’ అని సాగే లిరిక్స్.. హీరో గురించి చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. ఈ పాటని సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే ఈ వారం జరగబోయే ఈవెంట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. శ్రుతి హాసన్ పాడింది అంటే కచ్చితంగా మూవీలో ఉంటుందనే అనుకోవచ్చేమో?
శ్రుతి హాసన్ పాడిన ‘గ్లోబ్ ట్రాటర్’ పాట ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఇది సినిమా కోసమా లేక ఈవెంట్ కోసమా అనేది స్పష్టం కానప్పటికీ, మహేశ్ బాబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. పూర్తి వివరాల కోసం ఎదురుచూడాలి.


