
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె తన కుటుంబ సభ్యుల పుట్టినరోజులకు సంబంధించి చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ముగ్గురు కుటుంబ సభ్యుల బర్త్‌డేలు ఒకే రోజు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Key Points
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఆంటోని తటిల్‌ను గత ఏడాది పెళ్లి చేసుకున్న కీర్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
అమ్మ, అచ్చా, అత్తమ్మల పుట్టినరోజులు ఒకే రోజు వచ్చాయని ఆమె పోస్ట్ చేసింది.
'ఒకే రోజు మూడు హృదయాలు' అంటూ కీర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కీర్తి సురేష్ వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియా యాక్టివిటీ
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈ చిన్నదాని వ్యక్తిగత విషయానికి వస్తే.. తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన ఆంటోని తటిల్‌ను గత ఏడాది పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి భర్తతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో తన అమ్మా.. అచ్చా.. అత్తమ్మతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘ఒకే రోజు, మూడు హృదయాలు. ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి.. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ, అచ్చా మరియు అత్తగారు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ వాట్ ఎ కోఇన్సిడెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒకే రోజు ముగ్గురి బర్త్‌డేలు: కీర్తి సురేష్ వైరల్ పోస్ట్
నెటిజన్ల రియాక్షన్: “వావ్ వాట్ ఎ కోఇన్సిడెంట్”
కీర్తి సురేష్ పంచుకున్న ఈ అరుదైన, అందమైన అనుభవం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఒకే రోజు ముగ్గురి బర్త్‌డేలు అనే అద్భుతమైన యాదృచ్చికం సోషల్ మీడియాలో విశేష స్పందన పొందింది.


