|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆకతాయిల నుంచి హీరోయిన్‌ను కాపాడిన స్టార్‌ హీరో ఫ్యాన్స్‌

Published: 08-09-2025, 10:12 PM
ఆకతాయిల నుంచి హీరోయిన్‌ను కాపాడిన స్టార్‌ హీరో ఫ్యాన్స్‌

తమిళ చిత్రం ‘ఇరవిన్ విళిగళ్’ షూటింగ్ సమయంలో నటి నీమా రే ఆకతాయిల దాడికి గురయ్యారు. అయితే, విజయ్ దళపతి అభిమానులు ధైర్యంగా ఆమెను కాపాడారు. ఈ సంఘటన ప్రస్తుతం సినీ వార్తల్లో చర్చనీయాంశం.

Key Points

1

కన్నడ నటి నీమా రే షూటింగ్ సమయంలో ఆకతాయిల దాడికి గురయ్యారు.

2

విజయ్ దళపతి అభిమానులు ఆమెను కాపాడారు.

4

ఇరవిన్ విళిగళ్ చిత్ర షూటింగ్ పూర్తయింది.

షూటింగ్ సమయంలో ఆకస్మిక దాడి

ఒక్కో సారి చిత్ర యూనిట్‌కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి ‘నీమా రే’  ఎదుర్కున్నారు. తమిళ్‌లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్‌ విళిగళ్‌..  ఈ చిత్రాన్ని సిక్కల్‌ రాజేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో  మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. ‘నీమా రే’ హరోయిన్‌గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్‌, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.

విజయ్ దళపతి అభిమానుల సహాయం

అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్‌ ‘నీమా రే’  చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు.

ఇరవిన్ విళిగళ్ చిత్రం విశేషాలు

అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్‌ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్‌కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని  దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి ‘నిమా రే’ చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్‌ విళిగల్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.  నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు.

ఇరవిన్ విళిగళ్ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే ఆడియో, ట్రైలర్ విడుదల కానుంది. ఈ ఘటన చిత్ర పరిశ్రమలో భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.