
కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి సంఘటన ఆధారంగా ‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ పేరుతో మలయాళ డైరెక్టర్ మేజర్ రవి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ హీరోగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బైకాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Key Points
కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి ఆధారంగా ఈ సినిమా వస్తోంది.
మలయాళ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ టైటిల్ అధికారికంగా ఖరారు.
మోహన్‌లాల్ హీరోగా రూమర్స్, నెటిజన్లు బైకాట్ చేయాలని డిమాండ్.
‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ మూవీ నేపథ్యం
కాశ్మీర్‌లోని పహల్గామ్ కొండ ప్రాంతం సమీపంలోని సుందరమైన గడ్డి మైదానంలో ఉన్న పర్యాటక ప్రదేశంలో ఏప్రిల్ నెలలో ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని 26 మందిని చంపడంతో భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కొందరిని మరీ దారుణంగా.. ప్యాంట్ విప్పించి మరీ కాల్చి చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను కన్నీరు పెట్టేలా చేసింది. రెండు వారాల తర్వాత, భారతదేశం సైనిక చర్యతో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఎదురుదాడి చేసింది. ఇది రెండు ప్రత్యర్థులైన భారతదేశం, పాకిస్తాన్ మధ్య హింసను పెంచింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ వివాదం కాస్త సర్ధుమనిగింది.
ఈక్రమంలో.. తాజాగా, ఈ సంఘటన ఆధారంగా ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మలయాళ డైరెక్టర్ మేజర్ రవి (Major Ravi)దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ (Pahalgam: Operation Sindoor)టైటిల్‌తో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మూకాంబికా దేవి ఆలయంలో జరిగినట్లు తెలుపుతూ రవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను షేర్ చేశాడు. దీనిని ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మిస్తున్నారు.
మేజర్ రవి దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా?
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా.. ఇందులో తీవ్రమైన యాక్షన్ సీన్స్‌తో పాటు భావోద్వేగానికి సంబధించినవి, దేశభక్తిని చూపించే సన్నివేశాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ (Mohanlal)హీరోగా చేస్తున్నట్లు టాక్. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రవిని బైకాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సినిమాపై నెటిజన్ల ఆగ్రహం, బైకాట్ పిలుపు
A post shared by Presidential Movies International (@presidentialmovies)
మొత్తం మీద, ‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ సినిమా దాని వివాదాస్పద నేపథ్యం, హీరో రూమర్స్, మరియు నెటిజన్ల బైకాట్ డిమాండ్‌లతో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.


