|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిరాయ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. భారీ బ్లాక్‌బస్టర్ మిస్సయ్యాడుగా..

Published: 12-09-2025, 10:15 AM
మిరాయ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. భారీ బ్లాక్‌బస్టర్ మిస్సయ్యాడుగా..

‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించగా, ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాను మొదట స్టార్ హీరో నాని రిజెక్ట్ చేశారట.

Key Points

1

మిరాయ్ మూవీకి మొదట నానిని హీరోగా అనుకున్నారు.

2

రెమ్యునరేషన్ తేడాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

4

తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్స్‌తో సినిమా ఆకట్టుకుంది.

మిరాయ్ మూవీ విజయం

Mirai Movie: ‘హనుమాన్’వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జ నటించిన మూవీ ‘మిరాయ్’. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘మిరాయ్’మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ రావడంతో బాక్పాఫీస్ వద్ద దూసుకపోతుంది. మరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్దమైంది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే..? ఈ సినిమాకి మొదటి హీరో తేజ సజ్జ కాదట. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మూడేళ్ల కిందట రాసుకున్న కథను ముందుగా ఓ స్టార్ హీరో కు చెప్పారంట. ఇంతకీ ఆ హీరో ఎవరు? కారణమేంటీ?

నాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం

‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన తాజా చిత్రం ‘మిరాయ్ (Mirai)’. ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కింది. నిర్మాతలుగా టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) వ్యవహరించారు.

మిరాయ్ సినిమాలో తేజ యాక్టింగ్ మెచ్యూర్డ్‌గా, ప్రత్యేకంగా పోరాట సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. మంచు మనోజ్ తో నటించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే, ప్రభాస్ (Rebel Star) ఎంట్రీ సీన్ సినిమాలోని ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లోనే మేకర్స్ అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ కు ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు.

తేజ సజ్జకు లభించిన అవకాశం

సినిమా ప్రేమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందుతూ సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ‘మిరాయ్’తో తేజ మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు’ అని తెలిపారు. మొత్తం విషయాన్ని పరిశీలిస్తే, ఈ సినిమా తేజా కోసం మంచి ఛాన్స్ కావడమే కాకుండా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కథను ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకరావడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మూడు సంవత్సరాల క్రితమే రాసుకున్నారు. తొలుల ఈ కథను స్టార్ హీరో నాని (Nani)కు చెప్పారట. ఈ కథను నాని సానుకూలంగా స్పందించనా, రెమ్యూనరేషన్ తేడాల కారణంగా నాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న తేజ సజ్జ దగ్గరకు వచ్చింది. వెంటనే తేజ అంగీకరించారు. ఫైనల్ రిజల్ట్ ఈ రోజు వచ్చింది. ఇలా తేజ సజ్జ తన ఖాతాలో మరో సక్సెస్ వేసుకున్నారనే చెప్పాలి.

మొత్తంగా, ‘మిరాయ్’ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. నానికి అందని అవకాశం తేజ సజ్జకు దక్కింది. తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్స్‌తో సినిమా ప్రేక్షకులను అలరించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.