
📌 Key Points
- ‘ఇట్లు అర్జున’ గ్లింప్స్‌కు కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ అందించారు.
- మాట్లాడలేని అర్జున పాత్రలో డెబ్యూ హీరో అనీష్ అద్భుతంగా నటించాడు.
- వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు.
వెంకీ కుడుముల నిర్మాణంలో రూపొందుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రం టీజర్ విడుదలైంది. కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఆసక్తికరంగా ప్రారంభమైన ఈ గ్లింప్స్, అనీష్‌ని హీరోగా పరిచయం చేసింది. ప్రేమ, ధైర్యం కలగలిసిన అర్జున ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.
నాగార్జున మ్యాజికల్ వాయిస్ ఓవర్‌తో ‘సోల్ ఆఫ్ అర్జున’ గ్లింప్స్
వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ తన తొలి ప్రొడక్షన్ ను ‘ఇట్లు అర్జున'(itllu arjuna) తో ప్రారంభించింది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వెంకీ కుడుముల(Venky Kudumula), కంటెంట్ బేస్డ్ కథలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్మాతగా కొత్త జర్నీని ప్రారంభించారు. నూతన దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిష్(Anish)ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అనస్వర రాజన్ హీరోయిన్. తాజాగా విడుదలైన ‘సోల్ ఆఫ్ అర్జున’ఈ మూవీ వరల్డ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ గ్లింప్స్ కింగ్ నాగార్జున అందించిన మ్యాజికల్ వాయిస్ ఓవర్‌తో ప్రశాంతంగా, కవిత్వాత్మకంగా ప్రారంభమవుతుంది. ప్రేమ స్వచ్ఛత, లోతును ఆయన మాటలు గొప్ప ఆవిష్కరిస్తాయి. ఆ వర్ణనలోనే అర్జున పరిచయమౌతాడు. అర్జున మాట్లాడలేడు, కానీ నిశ్శబ్దం అతనిని బలహీనపరచదు, అతని భావోద్వేగాలను తగ్గించదు.
అతని ధైర్యం, బలం ఈ టీజర్‌లో ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది.డెబ్యూ హీరోగా అనీష్ ఆకట్టుకునే నటన కనబరిచాడు. ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. డైలాగ్స్‌కు ఆస్కారం తక్కువగా ఉండే పాత్రలో భావ వ్యక్తీకరణ, బాడీ లాంగ్వేజ్‌తోనే కథను మోయడం ప్రశంసనీయం. కళ్లలో కనిపించే ఇంటన్సిటీ అతన్ని పూర్తి హీరో మెటీరియల్‌గా నిలబెడతాయి. సాహసోపేతమైన జంప్స్, రా ఫిజికాలిటీతో కూడిన యాక్షన్ షాట్స్ గొప్ప యీజ్ తో చేశాడు. అనస్వర రాజన్ ఫ్రేమ్‌కు తాజాదనాన్ని తీసుకొస్తుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తూ, గ్లింప్స్‌లోనే కథ భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయానికి చేరువ చేస్తుంది. నాగార్జున మ్యాజికల్ వాయిస్ ఓవర్ ఈ గ్లింప్స్‌కు మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
డెబ్యూ హీరో అనీష్ ఆకట్టుకునే ప్రదర్శన
వెంకీ కుడుముల నిర్మాణంలో ‘ఇట్లు అర్జున’ ప్రత్యేకతలు
నాగార్జున అందించిన మ్యాజికల్ వాయిస్ ఓవర్, అనీష్ నటన, కథాంశం ‘ఇట్లు అర్జున’ చిత్రంపై అంచనాలను పెంచింది. ఈ గ్లింప్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకొని, సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


