
తాజా టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం, స్టార్ మా ఛానెల్ యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న “కుకు విత్ జాతిరత్నాలు” షో అగ్రస్థానంలో నిలిచింది. జీ తెలుగు డ్యాన్స్ షో రెండో స్థానంలో ఉంది. స్టార్ మా ఛానెల్ యొక్క ప్రజాదరణను ఈ టీఆర్పీ రేటింగ్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి.
Key Points
యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉన్న "కుకు విత్ జాతిరత్నాలు" షోకు 5.49 టీఆర్పీ రేటింగ్.
జీ తెలుగు డ్యాన్స్ షో "డ్రామా జూనియర్స్" రెండో స్థానంలో నిలిచింది.
స్టార్ మా ఛానెల్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోలలోనూ ఆధిపత్యం చూపిస్తోంది.
ఈటీవీ షోలు టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయాయి.
కుకు విత్ జాతిరత్నాలు షోకు అత్యధిక టీఆర్పీ
స్టార్ మా సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆ ఛానెల్ సీరియల్సే టీఆర్పీల్లో టాప్ లో ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు టీవీ ఎంటర్టైన్మెంట్ షోలలోనూ ఆ ఛానెల్ సత్తా చాటుతోంది. ఈటీవీని వెనక్కి నెట్టి స్టార్ మాలో వచ్చే కుకు విత్ జాతిరత్నాలు షో తొలి స్థానంలో నిలవడం విశేషం. ఈ మధ్యే ఆ ఛానెల్లో ప్రారంభమైన షో ఇది.
తెలుగు టీవీ షోస్ కి సంబంధించి 28వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో స్టార్ మాలో వచ్చే కుకు విత్ జాతిరత్నాలు టాప్ లో నిలిచింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉన్న ఈ కామెడీ రియాల్టీ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఈవారం ఈ షోకి ఏకంగా 5.49 రేటింగ్ వచ్చింది.
తెలుగు షోలలో ఇదే అత్యధిక రేటింగ్ కావడం విశేషం. తమిళ షో కుకు విత్ కోమలిని తెలుగులో ఇలా కుకు విత్ జాతిరత్నాలుగా తీసుకొచ్చారు. ఇందులో సెలబ్రిటీలు జోడీలుగా విడిపోయి వివిధ వంటకాలు చేస్తారు. ఈ వంటలకు కామెడీని జోడించడంతో ఈ షో సూపర్ హిట్ అయింది.
డ్రామా జూనియర్స్ రెండో స్థానంలో
ఈ షో తర్వాత రెండో స్థానంలో జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ నిలిచింది. ఇదో డ్యాన్స్ షో. శని, ఆదివారాల్లో వస్తుంది. శనివారం వచ్చే ఎపిసోడ్ కు 5.15 రేటింగ్ నమోదైంది. మూడో స్థానంలో మరోసారి కుకు విత్ జాతిరత్నాలు ఆదివారం ఎపిసోడ్ 4.17 రేటింగ్ తో నిలిచింది.
టాప్ 3 తర్వాత స్టార్ మాలోనే వచ్చే శ్రీముఖి హోస్ట్ చేసే ఆదివారం విత్ స్టార్ మా పరివారం నాలుగో స్థానంలో ఉంది. ఈ షోకి 4.02 రేటింగ్ నమోదైంది. ఆ తర్వాత ఈటీవీలో వచ్చే ఫ్యామిలీ స్టార్స్ 3.45 రేటింగ్ తో ఐదోస్థానంలో ఉంది. దీనికి సుధీర్ యాంకర్ గా ఉన్నాడు.
స్టార్ మా ఆధిపత్యం
ఇక ఈటీవీలోనే వచ్చే మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ 3.14 రేటింగ్ తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఏడో స్థానంలో ఆదివారం వచ్చే డ్రామా జూనియర్స్ 3.01 రేటింగ్ తో నిలిచింది. ఈటీవీ షోలు ఢీ 2.93, జబర్దస్త్ 2.2 రేటింగ్స్ తో తర్వాతి స్థానంలో ఉన్నాయి.
నిజానికి ఎంటర్టైన్మెంట్ షోల విషయంలో కొన్నాళ్ల కిందట ఈటీవీ హవా కొనసాగేది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటివి టాప్ లో ఉండేవి. కానీ స్టార్ మా కొత్త కొత్త షోలతో వినోదం పంచుతూ మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తున్నాయి.
తెలుగు టీవీ ప్రేక్షకుల ఆదరణను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకుంటోంది. కొత్త షోలతో ప్రేక్షకులను అలరిస్తూ, టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తోంది.

