|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్: తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే.. టాప్‌లోనే కార్తీకదీపం

Published: 29-05-2025, 7:22 AM
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్: తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే.. టాప్‌లోనే కార్తీకదీపం

తెలుగు టీవీ సీరియల్స్ 20వ వారం టీఆర్పీ రేటింగ్స్ విడుదలయ్యాయి. స్టార్ మా సీరియల్స్ టాప్ 10లో దominate చేస్తున్నాయి. కార్తీకదీపం 2 మళ్ళీ టాప్ స్థానంలో నిలిచింది.

Key Points

1

కార్తీకదీపం 2 టీఆర్పీ రేటింగ్స్‌లో మళ్ళీ టాప్‌లో నిలిచింది.

2

స్టార్ మా ఛానెల్ సీరియల్స్ టాప్ 10లో ఆధిపత్యం చూపుతున్నాయి.

4

ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండెనిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం టాప్ 5లో ఉన్నాయి.

టాప్ 10 సీరియల్స్ రేటింగ్స్

తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 20వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. గత వారంలాగే ఈ వారం కూడా రేటింగ్స్, టాప్ 10 సీరియల్స్ లో పెద్దగా మార్పులేమీ లేవు. 9 సీరియల్స్ స్టార్ మాకు చెందినవే ఉన్నాయి. జీ తెలుగు నుంచి కేవలం ఒకే ఒక్క సీరియల్ మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకుంది.

తెలుగు టీవీ సీరియల్స్ లో మరోసారి టాప్ ప్లేస్‌లో నిలిచింది కార్తీకదీపం 2 . ఈ ఏడాది 20వ వారం కూడా ఆ సీరియల్ కే అత్యధిక రేటింగ్ నమోదైంది. తాజా రేటింగ్స్ లో ఈ సీరియల్ కు 12.02 టీఆర్పీ సాధించింది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 11.19 రేటింగ్ నమోదైంది.

స్టార్ మా ఛానెల్ ఆధిపత్యం

ఇక మూడు, నాలుగు స్థానాల్లో గుండెనిండా గుడిగంటలు (10.38), ఇంటింటి రామాయణం (10.31) ఉన్నాయి. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ 7.82 రేటింగ్ తో నిలిచింది. ఇక బ్రహ్మముడి సీరియల్ ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. ఆ సీరియల్ కు 20వ వారం 7.09 రేటింగ్ వచ్చింది. ఏడో స్థానంలో ఉన్న నువ్వుంటే నా జతగా సీరియల్ 6.62 రేటింగ్ సాధించింది. 8వ స్థానంలో నిన్ను కోరి (6.08), 9వ స్థానంలో పలుకే బంగారమాయెనా (5.92) సీరియల్స్ ఉన్నాయి.

ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే 20వ వారం కూడా ఆ ఛానెల్ కు చెందిన ఒకే ఒక్క సీరియల్ టాప్ 10లో చోటు సంపాదించింది. అంతేకాదు ఒక్క సీరియల్ కూడా కనీసం 6 కంటే ఎక్కువ రేటింగ్ సాధించలేదు. ఆ ఛానెల్లో అత్యధింగా 5.80 రేటింగ్ తో మేఘసందేశం సీరియల్ టాప్ లో, ఓవరాల్‌గా 10వ స్థానంలో ఉంది. ఇక చామంతి సీరియల్ 5.62, జగద్ధాత్రి 5.59, లక్ష్మీనివాసం 5.02 రేటింగ్స్ సాధించాయి.

జీ తెలుగు సీరియల్స్ పరిస్థితి

అయితే క్రమంగా తెలుగులో స్టార్ మా ఛానెల్ సీరియల్స్ ఆధిపత్యం సాధిస్తున్నాయి. జీ తెలుగు సీరియల్స్ వాటికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఇక ఈటీవీ, జెమినిలాంటి ఛానెల్స్ మాత్రం సీరియల్స్ విషయంలో అసలు అడ్రెస్ లేకుండా పోయాయి.

20వ వారం టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం, స్టార్ మా సీరియల్స్ తెలుగు టీవీలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. జీ తెలుగు సీరియల్స్ పోటీ ఇవ్వలేకపోతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.