
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన శుభశ్రీ రాయగురు, నిర్మాత అజయ్ మైసూర్ తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి ప్రేమకథ గురించి అజయ్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
Key Points
బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, అజయ్ మైసూర్ నిశ్చితార్థం.
సాంగ్ షూటింగ్ సమయంలో ప్రేమ పులకించింది.
నెటిజన్ల నుండి వివిధ రకాల ప్రతిచర్యలు వస్తున్నాయి.
శుభశ్రీ మరియు అజయ్ మైసూర్ నిశ్చితార్థం
బిగ్‌బాస్(BIG BOSS) సీజన్-7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అక్కడ తన అందం, క్యూట్ క్యూట్ మాటలతో అందరినీ మెస్మరైజ్ చేసిన శుభశ్రీ రాయగురు(SubhaSri Rayaguru) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఒడిశాకి చెందిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. కానీ, బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా సుబ్బుకి ఫేమ్ వచ్చింది. అయితే తాజాగా శుభశ్రీ నిర్మాత, నటుడు అయిన అజయ్ మైసూర్(Ajay Mysoore) (ఏజే మైసూర్)తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరికీ పరిచయం ఎలా అయింది, ఎలా ప్రేమలో పడ్డారంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఈ క్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు అజయ్ మైసూర్. నిశ్చితార్థ వేడుకలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ శుభశ్రీతో లవ్ స్టోరీ గురించి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. “మేమిద్దరం కలిసి ఓ సాంగ్ చేశాము. అయితే మేము సాంగ్‌లోనే ప్రేమలో పడ్డాం.. పాట తీస్తూనే ఇది జరిగింది.. షూటింగ్ సీక్వెన్స్ ఒకటి చేసిన తర్వాత అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్రేమలో పడతామని.. కోస్టార్స్‌లా కలిసి నటించాం కానీ అలా జరిగిపోయింది అంతే.
ప్రేమకథకు అజయ్ మైసూర్ వివరణ
అక్కడి నుంచి ఇక్కడి వరకూ ఈ జర్నీ అంతా చూస్తే మమ్మల్ని ఆ విధే కలిపిందేమో అనిపిస్తుంది. ఇదంతా ఓ మేజిక్‌లా, అద్భుతంగా అనిపిస్తుంది.” అంటూ అజయ్ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిపై నెటిజన్లు ప్రేమ గుడ్డిది అని, మనీ మేక్స్ ఎవ్రిథింగ్ అని, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని, అబ్బో ఆమె ఓ లైలా నువ్వో మజ్ను మాకేంటి ఈ నస అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల ప్రతిచర్యలు
A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)
అజయ్ మైసూర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. వారి ప్రేమకథకు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ జంటకు అభిమానుల శుభాకాంక్షలు.


