
📌 Key Points
- సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’లో శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
- రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా శివకార్తికేయన్ 25వ ప్రాజెక్ట్.
- శ్రీలీల అంకితభావం, తమిళం నేర్చుకోవడంపై దర్శకురాలు సుధా కొంగర ప్రశంసలు కురిపించారు.
- శ్రీలీల కళ్ళలో పట్టుదల చూసి ‘రత్నమాల’ పాత్రకు ఎంపిక చేసినట్లు సుధా కొంగర వెల్లడించారు.
కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ‘పరాశక్తి’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా, ఈ చిత్రం హీరోయిన్ శ్రీలీల అంకితభావం, పట్టుదల గురించి సుధా కొంగర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమె కళ్ళలో పట్టుదల చూసే ‘రత్నమాల’ పాత్రకు ఎంపిక చేశానని తెలిపారు.
‘పరాశక్తి’ పై భారీ అంచనాలు
కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara)తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’(Parashakti). ఇందులో శివకార్తికేయన్(Sivakarthikeyan), శ్రీలీల(Sreeleela) జోడీగా నటిస్తున్నారు. అలాగే రవి మోహన్ అథర్వ మురళి, ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా శివ కార్తికేయన్ కెరీర్‌లో 25వ ప్రాజెక్ట్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆకాశ్ భాస్కరన్‌కు చెందిన డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూ.150 కోట్ల బడ్జెట్‌తో ‘పరాశక్తి’ని నిర్మిస్తోంది. పొలిటికల్ డ్రామాగా, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్ జోరు పెంచిన సుధా కొంగర వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు చెబుతోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీలపై ప్రశంసలు కురిపించింది. ‘‘శ్రీలీల ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ తమిళం చాలా బాగా నేర్చుకుంది.
ఆమె డ్యాన్సింగ్ క్వీన్. మేకప్ లేకుండా అందాల రంగంలో ఒక ముఖాన్ని చూసి చాలా కాలం అయ్యింది. కానీ శ్రీలీల వైజయంతిమాల లాంటి అనుభూతిని కలిగిస్తుంది. ఈ పరాశక్తి షూటింగ్ సమయంలో, ఆమెకు చివరి మెడికల్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో శ్రీలీల ఉదయం పరీక్షలు పూర్తి చేసి మధ్యాహ్నానికి షూటింగ్ కోసం సెట్‌కు వచ్చింది. నేను ఆమె కళ్ళలో ఒక పట్టుదలను చూశాను. ఆ క్షణమే సినిమాలో ‘రత్నమాల’ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పింది. సుధా కొంగర మాటలు చూస్తే ‘పరాశక్తి’లో శ్రీలీల పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. శివకార్తికేయన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్న ఈ సినిమా, శ్రీలీలకు కూడా మరో లెవల్ గుర్తింపును తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి భారీ బడ్జెట్, బలమైన కథ, స్టార్ కాస్ట్‌తో ‘పరాశక్తి’ 2026 ప్రారంభంలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.
శ్రీలీల పట్టుదలకు సుధా కొంగర ప్రశంసలు
శ్రీలీల పాత్ర – సినిమా భవిష్యత్తు
సుధా కొంగర ప్రశంసలు శ్రీలీల పాత్రకు ప్రాధాన్యతను పెంచాయి. ‘పరాశక్తి’ ఆమెకు మంచి పేరు తెస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. బలమైన కథ, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయం.


