
ఆహా వీడియో ఓటీటీలో ప్రేక్షకులను అలరించిన సూపర్ హిట్ సెలబ్రిటీ గేమ్ షో సర్కార్ ఐదవ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.
Key Points
సుడిగాలి సుధీర్ హోస్ట్ గా సర్కార్ సీజన్ 5 ఆహాలో ప్రసారం.
జూన్ 6న సాయంత్రం 7 గంటలకు తొలి ఎపిసోడ్.
తెలుగులో తొలి బిడ్డింగ్ గేమ్ షోగా సర్కార్ ఘన విజయం సాధించింది.
ప్రముఖ సెలబ్రిటీలు ఈ సీజన్ లో పాల్గొంటారు.
సర్కార్ సీజన్ 5 ప్రోమో రిలీజ్
ఆహా వీడియో ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ సెలబ్రిటీ గేమ్ షో సర్కార్ (Sarkaar). ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న షో ఇది. తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా ఉండగా.. గత సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఐదో సీజన్ రాబోతోంది. గురువారం (మే 29) ఈ కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు.
సర్కార్ ఆహా వీడియో ఓటీటీ సూపర్ హిట్ గేమ్ షో. తెలుగులో వచ్చిన తొలి బిడ్డింగ్ గేమ్ షో ఇది. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఐదో సీజన్ తో రాబోతోంది. జూన్ 6న సాయంత్రం 7 గంటల నుంచి ఐదో సీజన్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో ఓటీటీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ఇందులో సుధీర్ తనదైన స్టైల్లో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు.
సుడిగాలి సుధీర్ హోస్టింగ్
ఈసారి తెలంగాణ యాసలో ఏవో డైలాగ్స్ చెప్పడానికి ట్రై చేశాడు కానీ.. అది పెద్దగా ఆకట్టుకోలేదు. “ఒకటే ఆట ఆడైనాకి.. ఏదోలాగా గెలిచేదాకి.. ఇంత పెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ స్టేజీ మీదున్నప్పుడే చేసేయాలా.. ఆడతామా ఏంటీ మళ్లీ.. సర్కార్ సీజన్ 5.. ఇక్కడ ఆడేది గెలవనీకె కాదు.. నువ్వేందో అందరికీ తెలవనీకే” అనే డైలాగుతో సుధీర్ ఈ కొత్త సీజన్ గురించి చెప్పాడు.
తన కామెడీ టైమింగ్ తో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ వచ్చిన తర్వాత సర్కార్ షో మరో స్థాయికి వెళ్లిందని చెప్పొచ్చు. గతేడాది నాలుగో సీజన్ తో అతడు తొలిసారి ఈ గేమ్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకుముందు మూడు సీజన్లను ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు చేశాడు.
ఆహా వీడియోలో స్ట్రీమింగ్
సర్కార్ ఓ సెలబ్రిటీ గేమ్ షో. 2021లో ప్రారంభమైంది. తమిళంలో జీవా ఈ షోకి హోస్ట్ గా ఉన్నాడు. ఆహా తమిళం ఓటీటీ ఈ షోని స్ట్రీమింగ్ చేస్తోంది. తెలుగులో తొలి నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదట్లో ప్రదీప్ హోస్ట్ కాగా.. ఇప్పుడు సుధీర్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షోకి రానా, సాయి పల్లవి, సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, ప్రియమణి, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లాంటి సెలబ్రిటీలు వచ్చారు.
ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ సుడిగాలి సుధీర్. ఆ షోలో సక్సెస్ తర్వాత ఈటీవీతోపాటు స్టార్ మా, జీ తెలుగులాంటి ఛానెల్స్ లో పలు షోలకు హోస్ట్ గా ఉన్నాడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు బుల్లితెరను కూడా వదల్లేదు. ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అల్లుడా మజాకాలాంటి షోలతో.. స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్, పార్టీ చేద్దాం పుష్పలాంటి షోలు సుధీర్ చేశాడు.
సుడిగాలి సుధీర్ హోస్ట్ గా సర్కార్ షో మరింత ఆసక్తికరంగా మారనుందని అభిమానులు ఆశిస్తున్నారు. జూన్ 6 వరకు వేచి చూద్దాం.


